Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

ఒకే గదిలో అవివాహిత జంట.. తప్పు కాదన్న హైకోర్టు!

unwed couples staying in hotel room is not illegal, ఒకే గదిలో అవివాహిత జంట.. తప్పు కాదన్న హైకోర్టు!

ఒకే గదిలో అవివాహిత జంట ఉండటంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. పెళ్లి కాని అబ్బాయి, అమ్మాయి ఒకే లాడ్జి గదిని పంచుకోవడం నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది. కోయం‌బత్తూరులోని ఓ లాడ్జిలో పోలీసులు రైడ్ చేయగా.. ఒక గదిలో అవివాహిత జంటను, మరో గదిలో మద్యం సీసాలను పట్టుకున్నారు. దీంతో రెవిన్యూ అధికారులు ఆ లాడ్జికి సీల్ వేశారు. ఇక దాన్ని సవాల్ చేస్తూ లాడ్జి యజమాని మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేశాడు.

దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. పెళ్లి కాని జంట ఒకే గదిలో ఉండటాన్ని నేరంగా చూడలేమని స్పష్టం చేసింది. అంతేకాకుండా అమ్మాయి, అబ్బాయి కలిసి ఒకే గదిలో ఉండకూడదని చట్టంలో లేదని.. అందువల్ల దాన్ని తప్పుగా ఎలా పరిగణిస్తామని జస్టిస్ ఎం.ఎస్. రమేష్ ప్రశ్నించారు. సహజీవనం చేయడం ఎలా నేరం కాదో.. ఒకే లాడ్జి గదిలో అవివాహిత జంట ఇష్టపూర్వకంగా ఉండటంలో కూడా తప్పులేదని వెల్లడించారు.

అలాగే ఒక గదిలో మద్యం సీసాలు లభించినంత మాత్రాన అక్రమంగా బార్‌ను నిర్వహిస్తున్నారని చెప్పలేమన్నారు. ఒకవేళ లాడ్జికి విచ్చేసిన అతిధులు స్వయంగా మద్యాన్ని కొనుగోలు చేసుకుని ఉంటే.. దాన్ని నేరం కిందకు ఎలా పరిగణిస్తామని కోర్టు ప్రశ్నించింది. కాగా, లాడ్జికి నిబంధనలకు విరుద్ధంగా సీల్ వేశారని.. వెంటనే దాన్ని తొలగించాలని కోయం‌బత్తూరు కలెక్టర్‌ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.