ఓటీటీలో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ …రిలీజ్ డేట్ ఫిక్స్..

క‌రోనా కార‌ణంగా విధించిన లాక్ డౌన్ వ‌ల్ల విడుద‌ల కాకుండా ఆగిపోయిన చాలా సినిమాలు ఓటీటీల బాట ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ద‌క్షిణాదిలో చాలా సినిమాలు ఓటీటీలో రిలీజైయ్యాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 3:20 pm, Fri, 3 July 20

క‌రోనా కార‌ణంగా విధించిన లాక్ డౌన్ వ‌ల్ల విడుద‌ల కాకుండా ఆగిపోయిన చాలా సినిమాలు ఓటీటీల బాట ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ద‌క్షిణాదిలో చాలా సినిమాలు ఓటీటీలో రిలీజైయ్యాయి. తాజాగా మరో చిత్రం విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. ‘బాహుబలి’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం తర్వాత శోభూ యార్లగడ్డ నిర్మించిన మూవీ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..’. సత్యదేవ్ మెయిన్ లీడ్ చేశాడు. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేం వెంకటేష్‌ మహా దర్శకత్వం వహించారు.

ఈ చిత్రాన్ని ముందుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావించింది. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు స్టార్ట‌వుతాయో ఎవ‌రికీ తెలియ‌డం లేదు. అందుకే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 15న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సీనియ‌ర్ న‌రేశ్, హరి చందన, జబర్దస్త్‌ రాంప్రసాద్‌, తదితరులు కీలక పాత్రలు పోషించారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ బిజిబాల్‌ సంగీతం అందించారు.