Britan PM Boris Johnson: పెరిగిన మ్యుటెంట్ కేసుల నేపథ్యం, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. తమ దేశంలో మ్యుటెంట్ కరోనా వైరస్ కేసులు సంఖ్య పెరగడం. దేశంలో పూర్తి లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో..

Britan PM Boris Johnson: పెరిగిన మ్యుటెంట్ కేసుల నేపథ్యం, బ్రిటన్  ప్రధాని బోరిస్ జాన్సన్ భారత  పర్యటన రద్దు.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 05, 2021 | 6:56 PM

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. తమ దేశంలో మ్యుటెంట్ కరోనా వైరస్ కేసులు సంఖ్య పెరగడం. దేశంలో పూర్తి లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఆయన ఇండియా టూర్ రద్దయింది. ఈ నెల 26 న భారత గణతంత్ర  దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావలసి ఉంది. ఇటీవలివరకు  ఆయన ఇండియా టూర్ ఉంటుందనే అనుకున్నప్పటికీ తమ దేశంలో ఒక్కసారిగా ఈ కేసులు పెరిగిపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది.

బోరిస్ జాన్సన్ మంగళవారం ఉదయం ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడారని, ఈ నెలాఖరులో తను ఇండియాకు రాలేనందుకు చింతిస్తున్నానని చెప్పారని డౌనింగ్ స్ట్రీట్ లోని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంగ్లండ్ లో 56 మిలియన్ల మందికి ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఫిబ్రవరి రెండో వారం వరకు అమలులో ఉండవచ్ఛు..అవసరమైతే పొడిగిస్తానని జాన్సన్ పేర్కొన్నారు. 24 గంటల్లో బ్రిటన్ లో 80 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

Also Read:

Haridwar Kumbh Mela 2021: కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. మకరసంక్రాంతి రోజు నుంచి కుంభమేళా ప్రారంభం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో పాటల రచయిత వెన్నెలకంటి మృతి..

మరో ముందడుగు వేయాలి, భారత, అమెరికా దేశాల మధ్య రక్షణ, భద్రతలో సహకారం,యూఎస్ దౌత్య ప్రతినిధి ఆకాంక్ష