Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

ఆ బీరుకు… రూ.73 లక్షల బిల్లు!

UK hotel bills journalist Rs 73 lakh for pint of beer

ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో సెప్టెంబరు 5న ఓ జర్నలిస్టుకు ఈ అనుభవం ఎదురైంది. బాధితుడు ఈ ఘటనపై వరుస ట్వీట్లు చేయడంతో ఇది వెలుగులోకొచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రీడా జర్నలిస్టు పీటర్‌ లేలర్‌.. మాంచెస్టర్‌లోని మాల్‌మైసన్‌ అనే హోటల్‌కు వెళ్లారు. ఒక బీరు ఆర్డరిచ్చారు. తనకు అమెరికాకు చెందిన బ్రాండ్లు వద్దని చెప్పడంతో బ్రిటన్‌కు చెందిన బ్రాండ్‌ డ్యూచర్స్‌ ఐపీఏను సర్వ్‌ చేశారు. బీరు తాగడం ముగిశాక బిల్లు చెల్లింపు కోసం పీటర్‌ తన కార్డు ఇచ్చాడు. ఉద్యోగిని బిల్లు చెల్లింపు కోసం స్వైప్‌ చేసుకొని కార్డు తిరిగివ్వబోతూ ఉండగా.. బీరు ఖరీదెంతయింది? అని పీటర్‌ అడిగాడు. క్షణంలో ఆమె కంగారు పడిపోయి, వెంటనే మేనేజర్‌ వద్దకు పరుగెత్తింది.

అసలు విషయం ఏంటంటే.. బీరు తాగాక బిల్లు చెల్లింపు సమయంలో సదరు ఉద్యోగిని 99,983.64 డాలర్లు (రూ.73,70,226) అని టైప్‌ చేయడంతో ఆ సొమ్ము పీటర్‌ ఖాతా నుంచి హోటల్‌ ఖాతాలోకి వెళ్లిపోయింది. దీనిపై స్పందించిన మేనేజర్‌ పీటర్‌కు సొమ్ము మొత్తాన్ని రీఫండ్‌ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ తప్పు జరిగినందుకు పీటర్‌కు క్షమాపణలు తెలిపారు. సంబంధిత బ్యాంకును సంప్రదించి, సొమ్ము మొత్తం రీఫండ్‌ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.

స్వైపింగ్‌ యంత్రంలో లోపాల వల్ల ఈ పొరపాటు జరిగి ఉండొచ్చని, ఈ ఘటనపై విచారణ జరుగుతోందని హోటల్‌ వర్గాలు తెలిపాయి. గత జులైలో నటుడు రాహుల్‌ బోస్‌కు కూడా ఇలాంటి అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. చండీగఢ్‌లోని మారియట్‌ హోటల్‌లో బస చేసిన ఆయన రెండు అరటి పళ్లను ఆర్డర్‌ చేసినందుకు రూ.442.50 బిల్లు వేశారు.