భారతీయుల వీసా గడువు పొడిగించిన బ్రిటన్

కరోనా వైరస్ నేపథ్యంలో బ్రిటన్‌లో చిక్కుకున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో విలయతాండం చేస్తోంది. దీంతో ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపొయింది. విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో అనేక మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. ఇదే క్రమంలో వీసాల గడువు ముగిసినప్పటికీ బ్రిటన్‌లో ఉండిపోయిన భారతీయులకు, ఇతర దేశాల పౌరులకు అక్కడి ప్రభుత్వం ఊరట నిచ్చింది. మే 31 వరకు అన్ని రకాల […]

భారతీయుల వీసా గడువు పొడిగించిన బ్రిటన్
Follow us

|

Updated on: May 23, 2020 | 9:55 PM

కరోనా వైరస్ నేపథ్యంలో బ్రిటన్‌లో చిక్కుకున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో విలయతాండం చేస్తోంది. దీంతో ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపొయింది. విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో అనేక మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. ఇదే క్రమంలో వీసాల గడువు ముగిసినప్పటికీ బ్రిటన్‌లో ఉండిపోయిన భారతీయులకు, ఇతర దేశాల పౌరులకు అక్కడి ప్రభుత్వం ఊరట నిచ్చింది. మే 31 వరకు అన్ని రకాల వీసాల గడువును పొడగిస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే పొడగించిన గడువు సమీపిస్తుండటం.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇంకా ఆంక్షలు అమలవుతుండటంతో మరోసారి అన్ని రకాల వీసాల గడువును పొడిగించింది. మరో రెండు నెలలపాటు పొడిస్తూ.. యూకే హోం సెక్రటరీ ప్రీతీ పటేల్ ప్రకటించారు. కరోనా కారణంగా బ్రిటన్‌లో చిక్కుకున్న విదేశీ పౌరుల వీసా గడువును జూలై 31 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. బ్రిటన్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులతో పాటు ఇతర దేశాలకు చెంది పౌరులకు లబ్ధి చేకూరనుంది.