బ్రిటన్ లో కరోనా విలయం.. ఒక్కరోజే 56 మంది మృతి

ఇటలీ తరువాత బ్రిటన్ దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజే 56 మంది కరోనా వ్యాధిగ్రస్థులు మరణించారు. ఒక్క  ఇంగ్లండ్ నగరంలోనే మృతుల సంఖ్య 53 కి పెరిగింది. అటు మొత్తం 233 మంది ప్రాణాలు కోల్పోగా..5,018 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది.

బ్రిటన్ లో కరోనా విలయం.. ఒక్కరోజే 56 మంది మృతి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 22, 2020 | 1:02 PM

ఇటలీ తరువాత బ్రిటన్ దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజే 56 మంది కరోనా వ్యాధిగ్రస్థులు మరణించారు. ఒక్క  ఇంగ్లండ్ నగరంలోనే మృతుల సంఖ్య 53 కి పెరిగింది. అటు మొత్తం 233 మంది ప్రాణాలు కోల్పోగా..5,018 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. సూపర్ మార్కెట్ల వద్ద నిత్యావసరాల కోసం జనాల రద్దీ పెరిగిపోతుండగా.. బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు మూతబడడంతో వీధులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా.. ప్రజలు ఫిజికల్ కాంటాక్ట్ ను తగ్గించుకోవాలని ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. ఇటలీలో ఒక్కరోజే 793 మంది కరోనా వ్యాధిగ్రస్థులు మృతి చెందారని, దీంతో మృతుల సంఖ్య 4,825 కి పెరిగిందని గుర్తు చేసిన ఆయన.. ఈ భయంకర రాకాసి కరోనాను ఎదుర్కొనేందుకు సమష్టిగా కృషి చేద్దామన్నారు. నేషనల్ హెల్త్ స్కీమ్ కుప్ప కూలే స్థితిలో ఉందని అంగీకరించారు. ఇది సునామీ వంటి పరిస్థితి.. ఇవాళ మదర్స్ డే.. అయితే ఈ సందర్భంలో వీడియో కాల్స్ ద్వారా వారికి కొడుకులు, కూతుళ్లు విషెస్ చెప్పాలి.. దయచేసి మీ తల్లులకు దూరంగా ఉండండి.. వయస్సు మళ్ళిన వారికి కరోనా సులభంగా సోకే అవకాశం ఉంది.. స్కైప్ ద్వారా వారికి శుభా కాంక్షలు తెలియజేయండి అని ఆయన దేశ ప్రజలనుద్దేశించి లేఖ రాశారు.

ఇలా ఉండగా.. లండన్ తదితర నగరాల్లోని ఆసుపత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లను ఐసీయులుగా మార్చేశారు. మెడికల్ షాపుల వద్ద మందులు తీసుకునేందుకు వఛ్చిన కస్టమర్లు ఒకరికొకరు చాంతాడంత దూరంలో క్యూలు కడుతున్నారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.