యశ్ బిర్లా గ్రూప్ ఛైర్మన్‌కు యూకో బ్యాంక్ షాక్

యశ్‌ బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ యశోవర్ధన్‌ బిర్లాకు యూకో బ్యాంక్‌ షాకిచ్చింది. బ్యాంకు రుణాలు చెల్లించకపోవడంతో ఆయనను ఎగవేతదారుడిగా ప్రకటిస్తూ.. యూకో బ్యాంక్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. యశోవర్దన్‌ బిర్లా గ్రూప్‌కు చెందిన బిర్లా సూర్య లిమిటెడ్‌ కంపెనీకి బ్యాంకు రూ. 100కోట్ల రుణాలు మంజూరు చేసింది. అయితే ఈ రుణాలు చెల్లించకపోవడంతో 2013 జూన్‌ 3న ఈ ఖాతాను నిరర్ధక ఆస్తిగా ప్రకటించింది. దీంతో బ్యాంకుకు బిర్లా సూర్య కంపెనీ చెల్లించాల్సిన మొత్తం రూ. […]

యశ్ బిర్లా గ్రూప్ ఛైర్మన్‌కు యూకో బ్యాంక్ షాక్
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2019 | 4:25 PM

యశ్‌ బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ యశోవర్ధన్‌ బిర్లాకు యూకో బ్యాంక్‌ షాకిచ్చింది. బ్యాంకు రుణాలు చెల్లించకపోవడంతో ఆయనను ఎగవేతదారుడిగా ప్రకటిస్తూ.. యూకో బ్యాంక్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. యశోవర్దన్‌ బిర్లా గ్రూప్‌కు చెందిన బిర్లా సూర్య లిమిటెడ్‌ కంపెనీకి బ్యాంకు రూ. 100కోట్ల రుణాలు మంజూరు చేసింది. అయితే ఈ రుణాలు చెల్లించకపోవడంతో 2013 జూన్‌ 3న ఈ ఖాతాను నిరర్ధక ఆస్తిగా ప్రకటించింది. దీంతో బ్యాంకుకు బిర్లా సూర్య కంపెనీ చెల్లించాల్సిన మొత్తం రూ. 67.55 కోట్లుగా ఉంది. అయితే ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ఛైర్మన్‌ యశోవర్ధన్‌ బిర్లాతో పాటు కంపెనీ డైరెక్టర్లు, ప్రమోటర్లు, హామీదారుల పేర్లను ఎగవేత దార్ల జాబితాలో చేరుస్తున్నట్లు బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. యశోవర్ధన్‌తో పాటు మరికొందరు వ్యాపారవేత్తల పేర్లను కూడా యూకో బ్యాంక్‌ ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో చేర్చింది. దీని ప్రకారం.. సదరు రుణగ్రహీతలకు ఇకపై ఏ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సాయం లభించదు. అంతేగాక.. ఆయా కంపెనీలు కొత్త వెంచర్లు ప్రారంభించకుండా ఐదేళ్ల పాటు నిషేధం ఉంటుంది. రుణదాతలు కంపెనీ, డైరెక్టర్లపై క్రిమినల్‌ చర్యలు కూడా చేపట్టే వీలుంటుంది.

ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా