Breaking News
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
  • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
  • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
  • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
  • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
  • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
  • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

ఉబర్, ఓలా డ్రైవర్ల సమ్మె.. ఈ సారైనా గట్టెక్కేనా..?

Ola And Uber Cab Drivers Strike Today, ఉబర్, ఓలా డ్రైవర్ల సమ్మె.. ఈ సారైనా గట్టెక్కేనా..?

ఉబర్, ఓలా క్యాబ్ డ్రైవర్లు మరోసారి సమ్మెబాట పట్టారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపడంతో పాటు.. వారి డిమాండ్లను కూడా నెరవేర్చాలంటూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టారు. దీంతో సుమారు 50 వేల క్యాబులు సేవలను నిలిపివేశాయి. కిలో మీటర్‌కు రూ.22 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు డ్రైవర్ల ఐడెంటిటీ రద్దును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం మొబైల్ యాప్‌లతో పాటు మీటర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు. క్యాబ్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను మార్చుకోవాలని కోరుతున్నారు. అంతేకాదు ఐటీ కాంపెనీలకు నడిపే క్యాబ్‌లకు సంబంధించి జీవో 61, 66లను అమలు చేయాలని క్యాబ్ డ్రైవర్ల జేఏసీ డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు డ్రైవర్ల పై దాడుల కేసులు పరిష్కరించేందుకు వినియోగదారుల కేవైసీ తప్పనిసరి చేయాలని, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ప్రస్తుతం క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు లీజు వాహనాలను పెంచేశాయి. దీంతో తమ ఆదాయం పడిపోయిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్షియర్ల వద్ద తీసుకున్న అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. అంతేకాదు గతంలో కూడా ఉబర్, ఓలా క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు దిగారు. క్యాబ్ డ్రైవర్ కష్టాన్ని ఈ రెండు సంస్థలు దోచుకుంటున్నాయని ఆరోపిస్తూ 2017 అక్టోబర్ 23న బంద్‌ నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో క్యాబ్ ఓనర్లు, డ్రైవర్లు ఓ రేంజ్‌లో ఆందోళన చేశారు. గతంలో హైదరాబాద్ మహానగరంలో క్యాబ్‌ల వినియోగం పెరగడంతో ఉబర్, ఓలా సంస్థలు తమ సేవలను మరింత విస్తరించాయి. కేవలం రూ.30 వేల డౌన్ పేమెంట్ చెల్లించి కారును మీ సొంతం చేసుకోవచ్చని, నెలకు రూ.70 వేలు సంపాదించుకోవచ్చని డ్రైవర్లకు ఆశ చూపాయి. దీంతో నగరంలోని కొన్ని వందల మంది డ్రైవర్లు ఉబర్, ఓలా సంస్థల్లో చేరి కారు ఓనర్లుగా మారారు.

అయితే తమకు రావాల్సిన నెలసరి మొత్తాన్ని ఫైనాన్స్, మెయింటెనెన్స్ రూపంలో ఈ రెండు సంస్థలు కాజేయడం మొదలుపెట్టాయి. నెలకు రూ.70 వేలు అని చెప్పి.. అన్ని పోను రూ.15 వేలు ముట్టచెప్పడం మొదలుపెట్టాయి. దీంతో సొంతంగా కార్లు కొనుక్కుని.. ఓలా, ఉబర్ సంస్థల్లో చేరిన డ్రైవర్లు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఫైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటన్నిటికీ పరిష్కారం చూపించాలంటూ డ్రైవర్లు ఆందోళనలు చేశారు. కాని ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పి.. బంద్‌ను ఆపివేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినప్పటికీ 2018లో కూడా ఉబర్, ఓలా డ్రైవర్లు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. మరి ఇప్పటి నుంచైనా.. క్యాబ్ డ్రైవర్లు సమ్మె బాట పట్టకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సామాన్య ప్రజానీకం అభిప్రాయపడుతోంది.