అరుణ గ్రహంపై అన్వేషణ…జపాన్ నుంచి ఎగసిన యుఏఈ ఉపగ్రహం

అంగారక గ్రహంపై అన్వేషణకు గల్ఫ్ దేశాల కూటమి..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ) కూడా శ్రీకారం చుట్టింది. ఈ కూటమి రూపొందించిన రాకెట్.. "హాప్" జపాన్ లోని టనెగాషిమా స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి..

అరుణ గ్రహంపై అన్వేషణ...జపాన్ నుంచి ఎగసిన యుఏఈ ఉపగ్రహం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 20, 2020 | 11:32 AM

అంగారక గ్రహంపై అన్వేషణకు గల్ఫ్ దేశాల కూటమి..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ) కూడా శ్రీకారం చుట్టింది. ఈ కూటమి రూపొందించిన రాకెట్.. “హాప్” జపాన్ లోని టనెగాషిమా స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి ఎగసింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల 58 నిముషాలకు దీన్ని ప్రయోగించారు. అరుణ గ్రహంపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు తామీ ప్రయోగాన్ని చేపట్టినట్టు  యూఏఈ వర్గాలు వెల్లడించాయి. అరబిక్ లో ఈ రాకెట్ లాంచ్ ని ‘అల్-అమల్’ అని వ్యవహరిస్తారట. గతంలోనే రెండు సార్లు ఈ మిషన్ ని చేపట్టదలచినప్పటికీ వాతావరణం బాగు లేనందున వాయిదా వేశారు. ఈ మిషన్ విజయవంతమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రయోగం జరిగిన గంట అనంతరం ఇది సక్సెస్ అయినట్టు జపాన్ లోని కంట్రోల్ రూమ్ లో ఉన్న శాస్త్రవేత్తలంతా  ప్రకటించి హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు. దుబాయ్ లోనూ ఇదే ‘సంబర వాతావరణం’ కనిపించింది. ఇక్కడి ఎత్తయిన  బుర్జ్ ఖలీఫా కట్టడంపై పది సెకండ్లపాటు దేదీప్యమానంగా .. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా లైట్ల కాంతులు విరజిమ్మాయి. వచ్ఛే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ ఉపగ్రహం మార్స్ కక్ష్యలోకి చేరవచ్ఛునని  భావిస్తున్నారు.  ఏడు ఎమిరేట్లతో కూడిన యుఎఈ ఏర్పడి ఆ నెలకు 50 సంవత్సరాలవుతుంది.

చెరుకు రసంతో కల్తీ లేని కమ్మటి బెల్లం.!ఇంట్లోనే తయారు చేసుకోండిలా
చెరుకు రసంతో కల్తీ లేని కమ్మటి బెల్లం.!ఇంట్లోనే తయారు చేసుకోండిలా
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి