మానవత్వం మేల్కొంది.. పాపా.! నువ్వే గెలిచావ్

కఠిన చట్టాలను అవలంభించే యూఏఈ అధికారులను మానవత్వం కూడా కదిలించింది. వారు నిబంధనలను పక్కనపెట్టి తొలిసారిగా ఓ హిందూ తండ్రి, ముస్లిం తల్లికి పుట్టిన బిడ్డకు బర్త్‌‌ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. కోర్టు ఆదేశాలతో రూల్స్‌ను బ్రేక్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. యూఏఈ చట్టాల ప్రకారం ముస్లింకు చెందిన వ్యక్తి, ముస్లిమేతర మహిళను పెళ్లి చేసుకోవచ్చు కానీ ఇస్లాంకు చెందిన మహిళ మాత్రం ముస్లిమేతరుడిని నిక్కా చేసుకునేందుకు వీలుండదు. కాగా ఇండియాకు చెందిన కిరణ్ బాబు, సనమ్ సాబూలు […]

మానవత్వం మేల్కొంది.. పాపా.! నువ్వే గెలిచావ్
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2019 | 11:48 AM

కఠిన చట్టాలను అవలంభించే యూఏఈ అధికారులను మానవత్వం కూడా కదిలించింది. వారు నిబంధనలను పక్కనపెట్టి తొలిసారిగా ఓ హిందూ తండ్రి, ముస్లిం తల్లికి పుట్టిన బిడ్డకు బర్త్‌‌ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. కోర్టు ఆదేశాలతో రూల్స్‌ను బ్రేక్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. యూఏఈ చట్టాల ప్రకారం ముస్లింకు చెందిన వ్యక్తి, ముస్లిమేతర మహిళను పెళ్లి చేసుకోవచ్చు కానీ ఇస్లాంకు చెందిన మహిళ మాత్రం ముస్లిమేతరుడిని నిక్కా చేసుకునేందుకు వీలుండదు. కాగా ఇండియాకు చెందిన కిరణ్ బాబు, సనమ్ సాబూలు 2016లో కేరళలో వివాహం చేసుకొని, షార్జాలో నివాసం ఉంటున్నారు. గత సంవత్సరం జూలైలో వారికి కుమార్తె జన్మించగా.. అనామ్తా ఏస్ లిన్ కిరణ్ అని పేరు పెట్టుకున్నారు.

అయితే అక్కడి చట్టాల కారణంగా పాపకు బర్త్ సర్టిఫికేట్‌ను ఇచ్చేందుకు అధికారులు అంగీకరించలేదు. దీనిపై ఆ దంపతులు కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో వారు ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నించగా.. పాపకు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ లభించలేదు. దీంతో కిరణ్ దంపతులు మరోమారు కోర్టును ఆశ్రయించారు. ఎలాగైతేనేం మానవతా దృక్పథంతో బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు అనుమతిస్తున్నామని కోర్టు పేర్కొంది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కాగా మరోవైపు కోర్టు నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి.