అక్కడ మాస్క్ ధరించకుంటే జరిమానా ఎంతో తెలుసా..!

కరోనావైరస్ నియంత్రలో ప్రపంచ దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒక వ్యక్తికి సోకిన వ్యాధితో ఆగకుండా తనతో పాటు అందరికీ అంటుతోంది. దీంతో ప్రభుత్వాలు నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నాయి. జనం మాత్రం నిర్లక్ష్యంగా అడపాదడపా నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. దీంతో దుబాయ్ ప్రభుత్వం మాస్క్ ధరించకుంటే భారీ జరిమానా తప్పదంటూ హెచ్చరిస్తోంది. కరోనా కట్టడికి అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలను తీసుకొచ్చింది. కొవిడ్-19ను కట్టడి చేయాలంటే ఈ మాత్రం నిబంధనలు ఉండాల్సిందేనంటోంది. […]

అక్కడ మాస్క్ ధరించకుంటే జరిమానా ఎంతో తెలుసా..!
Follow us

|

Updated on: May 19, 2020 | 7:14 PM

కరోనావైరస్ నియంత్రలో ప్రపంచ దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒక వ్యక్తికి సోకిన వ్యాధితో ఆగకుండా తనతో పాటు అందరికీ అంటుతోంది. దీంతో ప్రభుత్వాలు నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నాయి. జనం మాత్రం నిర్లక్ష్యంగా అడపాదడపా నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. దీంతో దుబాయ్ ప్రభుత్వం మాస్క్ ధరించకుంటే భారీ జరిమానా తప్పదంటూ హెచ్చరిస్తోంది.

కరోనా కట్టడికి అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలను తీసుకొచ్చింది. కొవిడ్-19ను కట్టడి చేయాలంటే ఈ మాత్రం నిబంధనలు ఉండాల్సిందేనంటోంది. కొవిడ్ 19 నిబంధనలు ఏమాత్రం పాటించకున్నా చర్యలు తప్పదని హెచ్చరిస్తోంది. దేశంలోని ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా మాస్క్ ధరించకుంటే ఏకంగా 3,000 దిర్హామ్ అంటే అక్షరాల రూ. 61,772 జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేసింది. క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.10,29,539 చొప్పున జరిమానా విధించాలని దుబాయ్ పాలకులు చట్టం చేశారు. పలుమార్లు నిబంధనలు ఉల్లంఘించేవారికి రూ.20 లక్షల జరిమానా విధించనున్నారు.

ఇక రోజువారీ కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి పూట రెండు గంటల పాటు కర్ఫ్యూను పొడగిస్తున్నట్టు దుబాయ్‌ ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ఇకపై రాత్రి 8 గంటలకు మొదలై ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇప్పటికే విమానాల రాకపోకలపై అంక్షలు విధించిన ప్రభుత్వం.. రంజాన్ పండుగ సందర్భంగా షాపింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.