ట్రంప్ ఆదేశాలమేరకే ఇరాన్‌పై దాడి: పెంటగాన్

బాగ్దాద్‌లో ఇరాన్‌ రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ ద‌ళానికి చెందిన అధిప‌తి జ‌న‌ర‌ల్ సులేమానిని అమెరికా ద‌ళాలు తుద‌ముట్టించాయి. దేశాధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల మేర‌కే సులేమానిని హ‌త‌మార్చిన‌ట్లు పెంట‌గాన్ వెల్ల‌డించింది. బాగ్దాద్‌ విమానాశ్ర‌య స‌మీపంలో కారులో వెళ్తున్న సులేమానిపై అమెరికా ద‌ళాలు వైమానిక దాడి చేశాయి. ఈ ఉద‌యం జ‌రిగిన దాడిలో సులేమాని ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ దాడి వెనుక ఉన్న వారిపై క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామని ఇరాన్ సుప్రీం నేత అయ‌తుల్లా ఖ‌మేని తెలిపారు. […]

ట్రంప్ ఆదేశాలమేరకే ఇరాన్‌పై దాడి: పెంటగాన్
Follow us

| Edited By:

Updated on: Jan 03, 2020 | 5:55 PM

బాగ్దాద్‌లో ఇరాన్‌ రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ ద‌ళానికి చెందిన అధిప‌తి జ‌న‌ర‌ల్ సులేమానిని అమెరికా ద‌ళాలు తుద‌ముట్టించాయి. దేశాధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల మేర‌కే సులేమానిని హ‌త‌మార్చిన‌ట్లు పెంట‌గాన్ వెల్ల‌డించింది. బాగ్దాద్‌ విమానాశ్ర‌య స‌మీపంలో కారులో వెళ్తున్న సులేమానిపై అమెరికా ద‌ళాలు వైమానిక దాడి చేశాయి. ఈ ఉద‌యం జ‌రిగిన దాడిలో సులేమాని ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ దాడి వెనుక ఉన్న వారిపై క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామని ఇరాన్ సుప్రీం నేత అయ‌తుల్లా ఖ‌మేని తెలిపారు.

ఇరాక్ లో జ‌న‌ర‌ల్ ఖాసిమ్‌ను ఓ హీరోగా కీర్తించేవారు. కానీ అమెరికా మాత్రం ఆయ‌న్ను ఓ ఉగ్ర‌వాదిగా చిత్రీక‌రించింది. ఇరాక్‌లో వేలాది మంది అమెరిక‌న్ల చావుకు ఆయ‌నే కార‌ణ‌మ‌న్నది అమెరికా ఆరోపణ. కుద్స్ ఫోర్స్ క‌మాండ‌ర్‌గా జ‌న‌ర‌ల్ సులేమాని గుర్తింపు పొందారు. అయితే సులేమాని హ‌త‌మైన‌ట్లు వార్త‌లు వెలుబ‌డ‌గానే ప్రెసిడెంట్ ట్రంప్ త‌న ట్విట్ట‌ర్‌లో అమెరికా జెండాను పోస్టు చేశారు.

[svt-event date=”03/01/2020,4:15PM” class=”svt-cd-green” ]

[/svt-event]