అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి

అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్‌ గడగడలాడిస్తోంది..మొన్నటి వరకు కాసింత తగ్గినట్టే అనిపించిన కరోనా వైరస్‌ వ్యాప్తి మళ్లీ విజృంభిస్తోంది..

అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి
Follow us

|

Updated on: Oct 30, 2020 | 4:34 PM

అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్‌ గడగడలాడిస్తోంది..మొన్నటి వరకు కాసింత తగ్గినట్టే అనిపించిన కరోనా వైరస్‌ వ్యాప్తి మళ్లీ విజృంభిస్తోంది.. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.. కరోనా వైరస్‌ వ్యాప్తి అమెరికన్లను ఆందోళనకు గురి చేస్తుందే తప్ప అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.. పరిస్థితులు సాధారణస్థితికి వస్తున్నాయంటూ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. గత 24 గంటల్లో 91 వేల కొత్త కేసులు నమోదయ్యాయని జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ లెక్కలు వేసి మరీ చెబుతోంది. వీటిని కలుపుకుంటే అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య సుమారు 90 లక్షలకు చేరుకుంది.. వెయ్యి మందికిపైగా కరోనా బలి తీసుకుంది.. ఇప్పటి వరకు అమెరికాలో 2,28,625 మంది కరోనా సోకి మరణించారు. ప్రపంచంలోనే ఎక్కువ కోవిడ్‌ కేసులున్నది అమెరికాలోనే! అలాగే ఎక్కువ మరణాలు కూడా ఇక్కడే సంభవించాయి. నెల కిందటి వరకు కరోనా అక్కడ తగ్గుముఖం పట్టింది.. అయితే పక్షం రోజుల నుంచి కేసులు ఒక్కసారిగా పెరగడం మొదలుపెట్టాయి. రెండు వారాల కిందట రోజుకు సగటున 52 వేల కేసులు నమోదయితే ఇప్పుడది 74 వేలకు చేరింది.. 15 రాష్ట్రాలలో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది.. 45 రాష్ట్రాలలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. ఇంత జరుగుతున్నా ట్రంప్‌ మాత్రం కరోనా తీవ్రత ఏమీ లేదంటున్నారు.. నిపుణులు చేస్తున్న హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆరోగ్య అధికారులు మాత్రం కరోనా వ్యాప్తి భయంకరంగా ఉందంటున్నారు. ప్రజలంతా అప్రమత్తతతో మెలగాలని సూచిస్తున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..