టైప్‌-2 డయాబెటిస్‌కి ఈ డ్రింక్‌తో అడ్డుకట్ట

The high-protein treatment also reduced appetite after the second meal compared with the low-protein equivalent., టైప్‌-2 డయాబెటిస్‌కి ఈ డ్రింక్‌తో అడ్డుకట్ట

ప్రపంచాన్నే వణికిస్తున్నదీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్‌..ఇది ఒకసారి మనిషిని ఎటాక్‌ చేసిందంటే.. మనల్ని వదలదు.. ఇక ఒంట్లో చేరిన మధుమేహాన్ని నివారించుకోలేము కాబట్టి..షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్లో ఉంచుకోవడం ఒక్కటే మార్గం.
డయాబెటిస్‌ రెండు రకాలు..టైప్‌- 1, టైప్‌ -2 డయాబెటిస్‌. వీటిలో సాదారణంగా టైప్‌-1ను చిన్నతనంలోనే గుర్తిస్తారు. వీరు ఇన్సులిన్‌ను వాడాల్సి ఉంటుంది. టైప్‌-2 డయాబెటిస్‌ అసహజ జీవన శైలి, వంశపారంపర్యం తదితర కారణాల వల్ల వస్తుంది. ఇది వెంటనే బయటపడదు. ఏదైనా సందర్బంలో రక్త పరీక్షలు చేయించుకున్నప్పుడు మాత్రమే ఇది తెలుస్తుంది.
టైప్‌-2 డయాబెటిస్‌ ఉన్నవారిలో షుగర్‌, ఇన్సులిన్‌ లెవల్స్‌ తగ్గిపోతాయి. ఇది అన్ని వయస్సుల వారికి వచ్చే అవకాశం ఉంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారిలో నీరసం, అలసట, బరువు తగ్గిపోవడం, తరచూ మూత్ర సమస్య, కంటి చూపు బ్లర్ గా కనిపించడం , తరచూ ఎక్కువ ఆకలిగా ఉండటం ఇవన్నీ టైప్ 2 డయాబెటిస్ కు ముఖ్య లక్షణాలు. కాళ్లలో వాపు, నొప్పి, తిమ్మెర్లుగా ఉండటం జరుగుతుంది.
ఇక టైప్ 2 డయాబెటిస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్బోహైడ్రైడ్‌లు అధికంగా ఉన్న భోజనంతో పాటు అల్పాహారం సేవిస్తుంటే బ్లడ్‌ షుగర్‌ స్థాయిలో మార్పుంటుంది.  క్రమం తప్పకుండా అల్పాహారం సేవిస్తుంటే బ్లడ్‌ షుగర్‌ స్థాయి త్వరగా తగ్గుముఖం పడుతుంది. లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లలో మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. రెగ్యులర్ వ్యాయామాలు, బాడీ వెయింట్ ను అండర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అయితే, తాజాగా కెనడాలోని టోరంటో విశ్వవిద్యాలయం వారు జరిపిన ఓ అధ్యయనంలో టైప్‌-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌ చేయగల ఓ అద్భుత పానియాన్నికనుగొన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌లో తృణధాన్యాలతో తయారు చేసిన పాలను తీసుకోవడం వల్ల టైప్‌-2 షుగర్‌ వ్యాధి గ్రస్తుల్లో రోజంతా వారి రక్తంలో గ్లూకోజ్‌ లెవల్స్‌ తగ్గుతాయని జర్నల్‌ ఆఫ్‌ డైరీ సైన్స్‌ వెల్లడించింది. డాక్టర్‌ గోఫ్‌ బృందం జరిపిన అధ్యయనం ప్రకారం.. ఈ పాలలోని కార్బోహైడ్రైడ్లు..నెమ్మదిగా జీర్ణక్రియకు సహాయపడుతూ.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయిని గుర్తించారు. శరీరంలో ప్రోటీన్‌ సాంద్రతను పెంచడం, రక్తంలో గ్లూకోజ్‌పై అధిక కార్బోహైడ్రేట్‌లు తృణధాన్యాల నుంచి తీసిన పాలతో సరిపడా అందుతాయిని వారు తేల్చారు. వీలైతే, తృణధాన్యాలతో తీసిన పాలను రోజుకు రెండుసార్లు వాడినా చక్కటి ప్రయోజనం కలుగుతుందని వారు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *