చోరీ సొమ్ము షేరింగ్‌లో క్లాష్..కత్తులతో పొడుచుకుని..

ఇద్దరూ ప్రాణ స్నేహితులు, తోడు దొంగలు. ఇద్దరు కలిసి దొంగతనాలు, దారి దోపిడీలకు పాల్పడుతూ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ, అంతలోనే ఇద్దరు మిత్రుల మధ్య చోరీ సొత్తు పంపకంలో వివాదం తలెత్తింది. దాంతో స్నేహితుడిపైనే కత్తితో దాడికి పాల్పడ్డాడు మరో చోర్‌ ఫ్రెండ్‌. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించారు. జరిగిన ఘటనపై పోలీసులు విచారించగా.. ఈ ఇద్దరు మిత్రుల అసలు గుట్టురట్టైంది. హైదరాబాద్‌ ఫిల్మింనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కత్తి దాడి ఘటనలో […]

చోరీ సొమ్ము షేరింగ్‌లో క్లాష్..కత్తులతో పొడుచుకుని..
Follow us

|

Updated on: Jan 28, 2020 | 6:19 PM

ఇద్దరూ ప్రాణ స్నేహితులు, తోడు దొంగలు. ఇద్దరు కలిసి దొంగతనాలు, దారి దోపిడీలకు పాల్పడుతూ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ, అంతలోనే ఇద్దరు మిత్రుల మధ్య చోరీ సొత్తు పంపకంలో వివాదం తలెత్తింది. దాంతో స్నేహితుడిపైనే కత్తితో దాడికి పాల్పడ్డాడు మరో చోర్‌ ఫ్రెండ్‌. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించారు. జరిగిన ఘటనపై పోలీసులు విచారించగా.. ఈ ఇద్దరు మిత్రుల అసలు గుట్టురట్టైంది.

హైదరాబాద్‌ ఫిల్మింనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కత్తి దాడి ఘటనలో గాయపడ్డ రవి అనే యువకుడికి అపోలో ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. దాడి చేసిన ఇర్షద్‌, గాయపడ్డ రవి ఇద్దరూ స్నేహితులు. ఇద్దరూ బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, రాయదుర్గం, నార్సింగ్ పరిధిలో బైక్‌ చోరీలు, సెల్‌ఫోన్‌ చోరీల్లో నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఓ సెల్‌ఫోన్‌ విషయంలో నిన్న ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అది మనసులో పెట్టురకున్న ఇర్షద్‌ ఇవాళ ఉదయం రవిపై దాడి చేశాడు. నిందితున్ని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.