స్వలింగ ప్రేమకు పెద్దలు నో .. జంట ఆత్మహత్య

ప్రేమ.. ఎప్పుడు..ఎక్క‌డ‌..ఎలా పుడుతుందో చెప్ప‌లేం. ప్రేమ‌కు కుల‌, మ‌త, త‌న, మ‌న బేధాలు లేవు. మాములుగా​ ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ‌ పుడుతుంది. కానీ తమిళనాడులో ఇద్దరు అమ్మాయిల ప్రేమ‌లో ప‌డ్డారు. అయితే వారి బంధానికి తల్లిదండ్రులు అడ్డుచెప్పగా.. అర్ధాంతరంగా తనువు చాలించారు. తమిళనాడు నమ్మక్కల్​ జిల్లాలోని పెరియమనాలి ఏరియాకు చెందిన ఓ మహిళ(23) పాలిటెక్నిక్​ కంప్లీట్ చేసి.. పవర్​లూమ్​ వర్క్​ షాప్​లో పనిచేస్తోంది. ఈమెకు మూడేళ్ల క్రితం పెళ్లి కాగా.. ఓ మగబిడ్డ కుడా […]

స్వలింగ ప్రేమకు పెద్దలు నో .. జంట ఆత్మహత్య
Follow us

|

Updated on: May 17, 2020 | 6:59 PM

ప్రేమ.. ఎప్పుడు..ఎక్క‌డ‌..ఎలా పుడుతుందో చెప్ప‌లేం. ప్రేమ‌కు కుల‌, మ‌త, త‌న, మ‌న బేధాలు లేవు. మాములుగా​ ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ‌ పుడుతుంది. కానీ తమిళనాడులో ఇద్దరు అమ్మాయిల ప్రేమ‌లో ప‌డ్డారు. అయితే వారి బంధానికి తల్లిదండ్రులు అడ్డుచెప్పగా.. అర్ధాంతరంగా తనువు చాలించారు.

తమిళనాడు నమ్మక్కల్​ జిల్లాలోని పెరియమనాలి ఏరియాకు చెందిన ఓ మహిళ(23) పాలిటెక్నిక్​ కంప్లీట్ చేసి.. పవర్​లూమ్​ వర్క్​ షాప్​లో పనిచేస్తోంది. ఈమెకు మూడేళ్ల క్రితం పెళ్లి కాగా.. ఓ మగబిడ్డ కుడా ఉన్నాడు. ద‌గ్గ‌ర్లోని కొట్టాయపాలానికి చెందిన మరో మహిళ(20) అదే వర్క్​షాప్​లో పనిచేస్తోంది. మొద‌ట‌ వీరిద్దరి మధ్య స్నేహం మొద‌లై.. అది కాస్తా ప్రేమగా మారింది. ఆ బంధం అక్కడితో ఆగిపోలేదు. వారి మధ్య లింగభేదం హద్దుల్ని చెరిపేసి ఒక‌రికి ఒక‌రిని దగ్గర చేసింది. ఇరువురి సాన్నిహిత్యం గురించి తెలిసిన ఆయా కుటుంబాల పెద్దలు… వారిని హెచ్చ‌రించారు. కలవడానికి వీలులేదని సూచించారు. ఈ బంధం నుంచి 20 ఏళ్ల మహిళను బయటపడేసేందుకు పెళ్లి కుదిర్చారు. మే 18న నిశ్చితార్ధం కావాల్సి ఉండగా.. ఇక కలిసే ఛాన్స్ ఉండదని భావించిన ఇద్దరు.. ఆదివారం సూసైడ్ చేసుకున్నారు. తమ ప్రేమను కాదన్నారన్న కారణంతో ఇద్దరూ ఒకే చీరకు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి.. వారిద్దరికీ నమ్మక్కల్​లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.