“ఒకే నంబర్‌”తో రెండు బైకులు.. షాకైన పోలీసులు..!

Two Bikes Have Same Registration Number, “ఒకే నంబర్‌”తో రెండు బైకులు.. షాకైన పోలీసులు..!

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో వాహనాలపై కేసులు ఒక్కోక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా ఒకే నంబర్‌తో రెండు వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లాకు చెందిన సృజన్ కుమార్ 2014లో ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. అయితే బైక్‌ని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా.. తన వద్ద పనిచేసే సత్యనారాయణకి అప్పగించాడు. అతడు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా.. తన స్నేహితుడి బండి నంబర్ వేసుకుని నడుపుతున్నాడు. అయితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు రేగొండకు చెందిన ప్రశాంత్‌ పై జరిమానా విధించారు. కాగా, తాను నిబంధనలు ఉల్లంఘించలేదని.. జరిమానా ఎందుకు విధించారని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన పోలీసులు ఒకే నంబర్‌తో రెండు వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. బైక్ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా నడుపుతున్న సృజన్ కుమార్, స్నేహితుడి బండి నంబర్‌తో తన వాహనం నడుతుతున్న సత్యనారాయణపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *