Breaking News
  • విశాఖ శారదాపీఠంలో విషజ్వర పీడా హర యాగానికి పూర్ణాహుతి. 11 రోజుల పాటు సాగిన అమృత పాశుపత సహిత యాగం. యాగాన్ని పర్యవేక్షించిన శారదా పీఠాధిపతులు.. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర.
  • కరోనా వల్ల ఆక్వా రంగం ఇబ్బందుల్లో ఉంది. వాలంటీర్ల ద్వారా ప్రజల సమాచారం సేకరిస్తున్నాం. నిత్యావసరాల ధరలు పెరగకుండా చూస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూస్తున్నాం-మోపిదేవి.
  • ప్రజల రాకపోకలపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాం-మంత్రి కన్నబాబు. కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించడం. ప్రజలకు సాయం అందించడం. ఫారెన్‌ రిటర్న్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక వ్యూహం-కన్నబాబు.
  • రాష్ట్రంలో పాల సరఫరాపై వివిధ డైరీలతో మంత్రి తలసాని సమీక్ష. డోర్‌డెలివరీ యాప్‌ల ద్వారా పాల సరఫరా. పాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు-మంత్రి తలసాని. పాల వాహనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు-తలసాని.
  • నిజామాబాద్‌లో కల్లు దొరకక ఇద్దరు మృతి. లాక్‌డౌన్‌ కారణంగా వారం రోజులుగా దొరకని కల్లు.
  • లాక్‌డౌన్‌తో చెన్నైలో విజయనగరం వాసుల అవస్థలు. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న కూలీలు. టీవీ9కు తమ గోడు చెప్పుకున్న కూలీలు.

టీటీడీపీ ‘ ఖేల్ ‘ ఖతం…. భవితవ్యం శూన్యం !

, టీటీడీపీ ‘ ఖేల్ ‘ ఖతం…. భవితవ్యం శూన్యం !

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ క్రమంగా వైభవం కోల్పోతోంది. తాజాగా ఇద్దరు సీనియర్ నేతలు బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారు. ఇక్కడ తమ రాజకీయ భవిష్యత్తు అంధకారంగా కనిపించడంతో ఇక వారు కమలం పార్టీకే జై కొట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి ఈ.పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి అక్కడి బీజేపీ నేతలతో మంతనాలు సాగించడమే ఇందుకు నిదర్శనం. తాము పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్ధంగా ఉన్నామని వీరు స్పష్టం చేశారు. ఆ మధ్య తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదట పెద్దిరెడ్డికి కూకట్ పల్లి నియోజకవర్గం టికెట్ ను ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ చివరిక్షణంలో దాన్ని నందమూరి సుహాసినికి కేటాయించిన సంగతి తెలిసిందే.ఈ మార్పును పెద్దిరెడ్డి జీర్ణించుకోలేకపోయారు. పార్టీలో సీనియర్ నైన తనను కాదని ఒక్కసారిగా రంగంలోకి వఛ్చిన సుహాసినికి ఇవ్వడమేమిటని అయన తన మద్దతుదారుల వద్ద వాపోయారు. అయితే.. లోక్ సభ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో చేరి.. కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పెద్దిరెడ్డి భావించినప్పటికీ ఆ తరువాత ఆ యోచనను విరమించుకున్నారు. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని టీటీడీపీ నిర్ణయించుకుంది. అటు ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎలక్షన్స్ లోనూ తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో తెలంగాణలోని ఈ పార్టీ నాయకుల్లో ఆశలు ఆవిరయ్యాయి. ఇక పార్టీని వీడడమే బెటరని అనుకుంటున్నారు. పైగా ఇక్కడ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకోవడం కూడా వారి ఆశలకు ఊతమిచ్చింది. తాను ఢిల్లీలో కమలనాథులతో భేటీ అయిన మాట వాస్తవమేనని, తన వెంట మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి కూడా ఉన్నారని పెద్దిరెడ్డి అంగీకరించారు. ఇదిలా ఉండగా తను పార్టీ మారే ప్రసక్తి లేదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పష్టం చేశారు.

Related Tags