తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా పెరుగుతోన్న కరోనా కేసులు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా..

తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా పెరుగుతోన్న కరోనా కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2020 | 7:44 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా.. గడిచిన 24 గంటల్లో 1933 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 19,14 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి వైరస్ సోకింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 29,168కి చేరింది. వీరిలో 13,428 మంది చికిత్స పొందుతుండగా.. 15,412 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక నిన్నఒక్క రోజే 19 మంది కరోనాతో చనిపోగా.. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది.

కాగా, గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 268 కేసులు నమోదు కాగా.. అనంతపురం 129, చిత్తూరు 159, గుంటూరు 152, కడప 94, కృష్ణా 206, కర్నూలు 237, నెల్లూరు 124, విశాఖ 49, ప్రకాశం 134, శ్రీకాకుళం 145, విజయనగరం 138 పశ్చిమ గోదావరి జిల్లాలో 79 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 11,53,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అటు కర్నూలు(3405), గుంటూరు(3019), అనంతపురం(3290) జిల్లాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదు కాగా, కర్నూలు(101), కృష్ణా(80) జిల్లాల్లో అత్యధిక మరణాలు సంభవించాయి.

ఇక తెలంగాణలో ఆదివారం 1,269 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో నిన్న‌ 8 మంది చనిపోయారు. ఇప్పటివరకూ 34 వేల 671 కేసులు నమోదు కాగా 356 మంది చనిపోయారు. ఇంకా 11, 883 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా 1,563 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 22,482 మంది డిశ్చార్జి అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆదివారం 800 మంది కరోనా బారిన పడ్డారు.

అలాగే.. రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్ జిల్లాలో 94, సంగారెడ్డి జిల్లాలో 36, ఖమ్మం జిల్లాలో 1, వరంగల్ అర్బన్‌ జిల్లాలో 12, వరంగల్ రూరల్‌ జిల్లాలో 2, నిర్మల్ జిల్లాలో 4, కరీంనగర్ జిల్లాలో 23, జగిత్యాల జిల్లాలో 4, యాదాద్రి జిల్లాలో 7, మహబూబాబాద్ జిల్లాలో 8, పెద్దపల్లి జిల్లాలో 9, మెదక్ జిల్లాలో 14, మహబూబ్ నగర్ జిల్లాలో 17, మంచిర్యాల జిల్లాలో 3, నల్గొండ జిల్లాలో 15, సిరిసిల్ల జిల్లాలో 3, ఆదిలాబాద్ జిల్లాలో 4, వికారాబాద్ జిల్లాలో 6, నాగర్ కర్నూల్ జిల్లాలో 23, జనగాం జిల్లాలో 6, నిజామాబాద్ జిల్లాలో 11., వనపర్తి జిల్లాలో 15, సిద్దిపేట జిల్లాలో 3, సూర్యాపేట జిల్లాలో 7, గద్వాలజిల్లాలో 7 కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్