ఇద్దరు తహసీల్దార్లపై సస్పెన్షన్‌ వేటు

విధుల దుర్వినియోగానికి పాల్పడ్డ ఇద్దరు తహసీల్దార్లను సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సస్పెండ్ చేశారు. మఠంపల్లి తహసీల్దార్ వేణుగోపాల్, గరిడేపల్లి తహసీల్దార్ చంద్రశేఖర్ సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు.

ఇద్దరు తహసీల్దార్లపై సస్పెన్షన్‌ వేటు
Follow us

|

Updated on: Aug 21, 2020 | 5:45 PM

విధుల దుర్వినియోగానికి పాల్పడ్డ ఇద్దరు తహసీల్దార్లను సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సస్పెండ్ చేశారు. మఠంపల్లి తహసీల్దార్ వేణుగోపాల్, గరిడేపల్లి తహసీల్దార్ చంద్రశేఖర్ సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. 430 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా మ్యూటేషన్‌ చేయడంపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. మఠంపల్లి మండలం పరిధిలో స్థానికులకు 52 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా తహసీల్దార్ వేణుగోపాల్ పట్టాలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. అటు,గరిడేపల్లి మండలంలోని గ్లెడ్ ఆగ్రో బయోటెక్ సంస్థకు అక్రమంగా 369 ఎకరాలకు సంబంధించిన.. పాసు పుస్తకాలు గరిడేపల్లి తహసీల్దార్‌ జారీ చేశారు.

ఇద్దరు తహశీల్లార్లపై ప్రభుత్వ భూమిని అప్పన్నంగా ప్రవేట్ వ్యక్తులకు ధారదత్తం చేయడంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన అధికారులు.. 6 వేల ఎకరాల భూమికి గాను 12 వేల ఎకరాలకు పాస్‌ పుస్తకాలు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో మరికొంత మంది రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్లు జిల్లా అధికారులు తేల్చారు. దీంతో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి.. తహశీల్దార్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే మరికొందరు రెవిన్యూ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్