Breaking News
  • ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించాం. శేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. బోగీలను క్రేన్‌ సాయంతో ఈ రాత్రికి తొలగిస్తాం -రైల్వే రెస్క్యూ అధికారి భార్గవ్‌
  • విజయవాడ: రేపు ఉ.11:45కు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు. అఖిలప్రియ కుటుంబంపై అక్రమ కేసులు ప్రభుత్వ వేధింపులపై ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేతలు
  • నిందితుడు ప్రకాష్‌ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు. మా ఆయనకు గతంలో కూడా ఇలాంటి అనుభవం ఉంది. గతంలో మా ఆయనను ఊరి నుంచి తరిమికొట్టారు. మా ఆయన ఎదురైతే నేనే చంపేస్తా-ప్రకాష్ భార్య సునీత ప్రకాష్‌ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలి-సునీత
  • వరంగల్‌: ఫోర్ట్‌ రోడ్డులో కారు బీభత్సం. ఒక ఆటో, 6 బైక్‌లను ఢీకొట్టిన కారు. 8 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆర్టికల్ 370రద్దుపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ఆటంకంగా మారిందన్న కేంద్రం. ఆర్టికల్ 370తో వేర్పాటువాదులు, ఉగ్రవాదులు ప్రయోజనం పొందారు ఆర్టికల్‌ 370 రద్దుపై ఈ నెల 14న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
  • మహారాష్ట్రలో గవర్నర్‌ సంచలన నిర్ణయం. ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌. మహారాష్ట్ర అసెంబ్లీలో బలాలు. బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్‌-44, ఇతరులు -29 బలనిరూపణ చేసుకోని తొలి రెండు స్థానాల్లో ఉన్న బీజేపీ, శివసేన. మూడో స్థానంలో ఉన్న ఎన్సీపీని ఆహ్వానించిన గవర్నర్‌
  • ప్రకాశం: 2017 భూకుంభకోణంలో రెవెన్యూ సిబ్బంది అరెస్ట్‌. రిటైర్డ్ తహశీల్దార్‌ మెర్సీకుమారి, గుడ్లూరు వీఆర్వో నాగరాజు, ఆపరేటర్‌ సురేష్‌ అరెస్ట్. అక్రమంగా పాస్‌బుక్‌లు పొందిన మరో నలుగురి అరెస్ట్‌, రిమాండ్‌కు తరలింపు

చెల్లి లవర్‌ను ట్రాప్ చేసిన అక్క.. కథలో అనుకోని ట్విస్ట్!

Two Sisters Did A Cyber Crime And Blackmailed A Person

ఇంటర్నెట్ చదరంగంలో అక్కాచెల్లెళ్ల జీవితం ఎలా కంచెకు చేరిందో ఇప్పుడు చూద్దాం.. అందమైన కుటుంబం.. ఆపై సంతోషాలు నిండిన జీవితం ఆ ఇద్దరిది. అక్క ప్రణవి ఓ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్.. చెల్లి మహిమ డిగ్రీ చదువుతూ జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. ఇక అనుకోని అతిథిలా అనిరుధ్ వారి జీవితాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చెల్లి మహిమను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ.. తనకోసం పడి చచ్చేవాడు. అయితే మహిమ మాత్రం అతడిని ఇష్టపడటం లేదు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే కథలో ట్విస్ట్ అన్నట్లుగా అన్నయ్య కోసం చేసిన అప్పు ఆ కుటుంబాన్ని వెంటాడింది.

అమెరికాలో సెటిల్ అయిన ఆ ఇద్దరి అన్నయ్య ఇంటికి డబ్బు పంపించడం మానేశాడు. అంతేకాకుండా తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం మానేశాడు. అటు అప్పులవాళ్లేమో.. వీళ్లకు ఫోన్ చేసి బెదిరించడం మొదలు పెట్టారు. ఇదంతా చూస్తున్న అక్క ప్రణవి తట్టుకోలేకపోయింది. తల్లిదండ్రులను కష్టాల నుంచి విముక్తి చేయాలని భావిస్తుంది. తన సాఫ్ట్‌వేర్ బుర్రకు పదును పెట్టి బ్రిలియంట్ స్కెచ్ వేస్తుంది.

ఇంటర్నెట్ ద్వారా లేని హోటల్‌ను క్రియేట్ చేసి.. దానిలో చెక్-ఇన్ అయితే ఆ డబ్బు వారి అకౌంట్‌లో పడేలా సాఫ్ట్‌వేర్ ఒకటి ప్రోగ్రాం చేస్తుంది. ఇక ఆమె అనుకున్న విధంగా అనిరుధ్ చేత ఆ హోటల్‌లో రూమ్ బుక్ చేస్తుంది. అటు అనిరుధ్ తనకు నచ్చిన అమ్మాయితో టైమ్ స్పెండ్ చేయబోతున్నానని సంతోషంతో వస్తాడు.. కానీ ఆ సంతోషం వెనుక ఓ దగా ఉందన్న సంగతి అతడికి తెలియదు. అక్కాచెల్లెళ్లు అనిరుధ్ కథను ముగించారా.. లేదా అనేది మీరే చూడండి..!