ఇద్దరు ప్రాణాలను బలితీసుకున్న లిఫ్టు

ఆర్థిక రాజధాని ముంబైలో విషాదం చోటుచేసుకుంది. ఒక బిల్డింగ్‌లోని లిప్టు తలుపు తెరుచుకోకపోవడంతో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృత్యువాత పడ్డారు.

ఇద్దరు ప్రాణాలను బలితీసుకున్న లిఫ్టు
Follow us

|

Updated on: Sep 24, 2020 | 12:49 PM

ఆర్థిక రాజధాని ముంబైలో విషాదం చోటుచేసుకుంది. ఒక బిల్డింగ్‌లోని లిప్టు తలుపు తెరుచుకోకపోవడంతో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృత్యువాత పడ్డారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరాన్ని ముంచెత్తింది. ఇదే క్రమంలో కాలాపాణీ ప్రాంతంలోని బిల్డింగ్ లోకి వరద నీరు వచ్చింది. దీంతో ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు బేస్‌మెంట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకూ లిఫ్టులో వచ్చారు. అయితే, లిప్టు తలుపులు తెరుచుకోలేదు. బేస్‌మెంట్‌లో నిండిన నీరంతా లిఫ్టులోనికి ప్రవేశించి అది నిండిపోయింది. ఫలితంగా లిఫ్టులోని నీటిలో మునిగి ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు.

ముంబైలోని కాలాపాణీ జంక్షన్ సమీపంలోని నైథానీ రెసిడెన్సీ అపార్టుమెంట్ కొన్నేళ్ల క్రితం నిర్మించారు. జమీర్ సోహనన్(32), షహజాద్ మేనన్(37) ఈ బిల్డింగ్‌కు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. వారు బిల్డింగ్‌కు నీటిని సప్లయ్ చేసేందుకు బేస్‌మెంట్ దగ్గరున్న పంప్ దగ్గర స్విచ్ ఆన్ చేసేందుకు వెళ్లారు. అప్పటికే బేస్‌మెంట్‌ మొత్తం వర్షం నీటితో నిండిపోయింది. దీంతో వారు లిప్టు నుంచి బయటకు రాకుండా, తలుపులు మూసివేశారు. తరువాత పైకి వెళ్లేందుకు లిఫ్టుకు కాల్ చేశారు. అయితే లిప్టు కదలలేదు. లిఫ్టు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు లిఫ్టు అలారం మోగించారు. దానిని విన్న బిల్డింగ్‌లోని కొంతమంది ఆ లిఫ్టు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఫైర్ బ్రిగేడ్‌కు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని, లిఫ్టు పైభాగాన్ని కట్ చేసి లోనికి వెళ్లేసరికి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నీటిలో మునిగిపోయారు. ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారిని పరిశీలించి, అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. దీంతో పోలీసులు ఆ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!