ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు టీఎస్ ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటన జిల్లాలోని కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద జరిగింది.

  • Shiva Prajapati
  • Publish Date - 4:08 pm, Fri, 27 November 20
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు టీఎస్ ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటన జిల్లాలోని కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది గాయపడగా.. వీరిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి, మణుగూరు డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు తనికెళ్ల సమీపంలో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక బస్సు ముందు భాగం ధ్వంసం అవగా, మరో బస్సుకు వెనుగ భాగం ధ్వంసమైంది. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓవర్ స్పీడ్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాద స్థలానికి చేరుకున్న ఆర్టీసీ అధికారులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.