కరోనా ఎఫెక్ట్.. రెండు పోలీస్ స్టేషన్లు క్లోజ్‌..!

కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాలను టచ్ చేసింది. కులం, మతం, రంగు,భాష, ప్రాంతమన్న విషయం దీనికి తెలియదు. అంతా ఒక్కటే. ఈ క్రమంలో మనదేశంలో కూడా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఇప్పటికే నెల రోజులు దాటినా కూడా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టలేదు. ఈ వైరస్ ప్రభావంతో లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో ఇప్పటికే అనేక […]

కరోనా ఎఫెక్ట్.. రెండు పోలీస్ స్టేషన్లు క్లోజ్‌..!
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 8:53 PM

కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాలను టచ్ చేసింది. కులం, మతం, రంగు,భాష, ప్రాంతమన్న విషయం దీనికి తెలియదు. అంతా ఒక్కటే. ఈ క్రమంలో మనదేశంలో కూడా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఇప్పటికే నెల రోజులు దాటినా కూడా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టలేదు. ఈ వైరస్ ప్రభావంతో లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో ఇప్పటికే అనేక కంపెనీలు మూతపడ్డాయి. ఇక కొన్ని ఆస్పత్రుల్లో వైద్యులకు కరోనా సోకడంతో ఆ ఆస్పత్రులను కూడా క్లోజ్ చేస్తున్నారు. ఒక్క ఆస్పత్రి అనే కాదు.. ఎక్కడ కరోనా సోకినా.. అక్కడి ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా చేస్తూ.. కఠిన చర్యలు చేపడుతోంది ప్రభుత్వం.

తాజాగా ఇప్పుడు పోలీస్ స్టేషన్‌ల వంతు వచ్చింది. కరోనాపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వారిలో వైద్య సిబ్బంది, శానిటైజేషన్ సిబ్బందిది ఎంత పాత్ర ఉందో.. అంతే పాత్ర పోలీసులది కూడా. అయితే వీరు క్వారంటైన్ సెంటర్ల వద్ద భద్రతా చర్యలు చేపడుతుండటంతో పాటు.. అనేక చోట్ల డ్యూటీలు చేస్తున్నారు. తమిళనాడులో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. కోయంబత్తూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు పోలీసులకు కరోనా సోకింది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. వారందరినీ క్వారంటైన్‌ సెంటర్లకు తరలించి.. పోలీస్ స్టేషన్‌లో ఉన్న సిబ్బందిని ఖాళీ చేయించారు. స్టేషన్‌ కూడా తాత్కాలికంగా మూతపడింది. అదే స్టేషన్‌కు దగ్గరలోని ఓ ఫంక్షన్‌ హాల్‌ నుంచి విధులు నిర్వహించడం ప్రారంభించారు.కరోనా ఎఫెక్ట్‌తో ప్రస్తుతం తమిళనాడులో పొదనుర్, కునియముత్తూర్ ప్రాంతాల్లోని రెండు పీఎస్‌లు తాత్కాలికంగా మూతపడ్డాయి.