రెండు పెంపుడు పిల్లులకు కరోనా.. ఉలిక్కిపడేలా చేసిన ఘటన

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మొట్టమొదటిసారి రెండు పెంపుడు పిల్లులకు సోకడం సంచలనం రేపింది. పెంపుడు జంతువులకు కరోనా సోకదని నిపుణులు చెబుతున్న తరుణంలో..

రెండు పెంపుడు పిల్లులకు కరోనా.. ఉలిక్కిపడేలా చేసిన ఘటన
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2020 | 2:19 PM

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మొట్టమొదటిసారి రెండు పెంపుడు పిల్లులకు సోకడం సంచలనం రేపింది. పెంపుడు జంతువులకు కరోనా సోకదని నిపుణులు చెబుతున్న తరుణంలో.. ప్రపంచం ఉలిక్కిపడే సంఘటన జరిగింది. ప్రపంచంలోనే తొలిసారిగా రెండు పెంపుడు పిల్లలకు కరోనా వైరస్ సోకడం ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికాలోని న్యూయార్క్‌లో రెండు పెంపుడు కాట్స్‌కి కోవిడ్-19 సోకినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్సన్, యూఎస్ డీఏ నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లేబరేటరీస్ ధ్రువీకరించాయి. కాగా కరోనా వైరస్ సోకిన ఈ పిల్లులు వేర్వేరు చోట్ల నివసిస్తున్నాయని, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నాయని అధికారులు వెల్లడించారు. అయితే పిల్లులు ఉన్న ఇళ్లల్లో ఎవరికీ ఈ వైరస్ సోకలేదని అధికారులు స్పష్టం చేశారు.

అంతకు ముందు బ్రాంక్స్ జూకు చెందిన పులులకు, సింహాలకు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మనుషుల నుంచే జంతువులకు కరోనా సోకుతుందే తప్ప జంతువుల నుంచి మనుషులకు కరనా సోకదని నిపుణులు వెల్లడిస్తున్నారు. కాగా ప్రస్తుతం న్యూయార్క్‌ రాష్ట్రంలో 2,58,589 మందికి కరోనా సోకగా వారిలో 15 వేల 302 మంది మరణించారు.

Read More: 

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

అగ్నికి ఆహుతైన.. లారీ శానిటైజర్

కోట్ల మంది ఫేస్‌బుక్ డేటా చోరీ.. రూ.41 వేలకు అమ్మకం