అలాంటి మాస్క్‌లను వాడటమే ఉత్తమం

కరోనా నుంచి రక్షించుకునేందుకు మాస్క్‌ ధరించడం తప్పనిసరి. అయితే వాటి విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలి.

అలాంటి మాస్క్‌లను వాడటమే ఉత్తమం
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2020 | 7:04 PM

కరోనా నుంచి రక్షించుకునేందుకు మాస్క్‌ ధరించడం తప్పనిసరి. అయితే వాటి విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో సర్జికల్ మాస్క్‌లు తుంపర్లు సమర్థవంతంగా అడ్డుకుంటాయని ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం వెల్లడించింది. అవే కరోనాను నిలువరించగలవని ఆ బృందం తెలిపింది. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసుకునే మాస్కులపై పరిశోధన చేసిన ఈ బృందం.. వాటిలో కనీసం రెండు, మూడు పొరలు ఉండాలని పేర్కొంది.

కరోనా బాధితులు తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా నోటి నుంచి వైరస్ బయటకు వస్తుంది. ఈ క్రమంలో ఇళ్లలో ఒక పొరతో తయారు చేసుకునే మాస్క్ మాట్లాడినప్పుడు తుంపర్లను అడ్డుకున్నా.. దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపర్లను ఏ మాత్రం ఆపలేవని గుర్తించారు. రెండు పొరలతో తయారు చేసిన మాస్క్‌లు ఈ విషయంలో కొంత మేర పనిచేయగలవని.. ఇంకా మూడు పొరలతో ఉన్న మాస్క్‌లు మరింత బాగా పనిచేస్తాయని వారు తేల్చారు.