దంతెవాడలో ఎన్‌కౌంటర్… ఇద్దరు నక్సల్స్ మృతి!

Naxals, దంతెవాడలో ఎన్‌కౌంటర్… ఇద్దరు నక్సల్స్ మృతి!

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో ఆదివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఒక మహిళ ఉంది. రాయ్‌పూర్‌కి 400 కిలోమీటర్ల దూరంలో ఉండే గమియాపాల్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవా మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కాల్పుల మోత మోగిందని వివరించారు. అనంతరం కొంతమంది మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. ఎన్‌కౌంటర్‌ అనంతరం ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను, పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి పేర్లు దేవ, మంగ్లీగా గుర్తించారు. వారిద్దరిపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉంది. మరోవైపు, ఇదే ప్రాంతంలో అనుమానిత మహిళా మావోయిస్టు కోసీని పోలీసులు అరెస్టు చేశారు. సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *