Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

బీజేపీలో రహస్యభేటీల కలకలం: ఆకర్ష్ కాక ఇంకేదో వుంది!

bjp leaders secret meeting, బీజేపీలో రహస్యభేటీల కలకలం: ఆకర్ష్ కాక ఇంకేదో వుంది!

వీరిద్దరు తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతలు. ఇద్దరు ఎమ్మెల్యేలుగా కలిసి పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వీరిద్దరు సికింద్రాబాద్ పార్లమెంటు టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. అదృష్టం తలుపు తట్టడంతో వీరిలో కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచి, కేంద్రంలో కీలకమైన హోం శాఖకు సహాయ మంత్రి అయ్యారు. ఇక్కడే మిగిలిన డా.కే.లక్ష్మణ్ రేపో మాపో తెలంగాణ యూనిట్ ప్రెసిడెంట్ పదవిని కోల్పోయే పరిస్థితిలో వున్నారు. అయితేనేం.. వీరిద్దరు రహస్య భేటీలతో మిగిలిన బీజేపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇదిప్పుడు తెలంగాణ బీజేపీలో హాట్ హాట్ చర్చగా మారింది. మరి వీరిద్దరి భేటీ ఎందుకు?

రాష్ట్ర ఎన్నికల అధికారి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే అంతా జరిగితే జనవరి 22న తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు జరగాల్సి వుంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నామమాత్రమే కావడంతో ప్రధాన పోటీ అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే అన్నది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి పెద్ద్ తేడా లేదంటున్న కమలనాథులు.. అర్బన్ ప్రాంతాల్లో తమకు పట్టుందన్న ధీమాతో మునిసిపల్ ఎన్నికల వ్యూహాన్ని రచిస్తున్నారు.

మునిసిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం గత వారం తెలంగాణ బీజేపీ కార్యాలయంలో జరిగింది. దానికి దాదాపు సీనియర్లంతా హాజరయ్యారు. ఈ మధ్య కాలంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న డికె అరుణ, జితేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ వంటి నేతలు హాజరయ్యారు. రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చిన తర్వాత మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించుకుని నిష్క్రమించారు.

అయితే.. ఇదంతా కళ్ళ ముందు జరిగింది. కానీ, తెరచాటులో మాత్రం పరిస్థితి వేరేలా వుంది. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, టీ.బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ రహస్య భేటీలతో మిగిలిన రాష్ట్ర నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నారని బీజేపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. గత వారం లక్ష్మణ్ ఇంట్లో భేటీ అయిన వీరిద్దరు.. తాజాగా హైదరాబాద్ లక్డీకాపూల్ ఏరియాలో అబోడ్ హోటల్‌లో గురువారం ఉదయం సమావేశమయ్యారు. ఈ భేటీకి ఇటీవల పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు కూడా హాజరైనట్లు సమాచారం.

ఈ భేటీలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు వెళ్ళిన మీడియాను లోనికి అనుమతించలేదు. కానీ సమావేశం తర్వాత కిషన్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు ప్రచారాంశాలపై చర్చలు జరిపినట్లు ఆయన చెప్పారు. కానీ ఈ రెండంశాలను చర్చించేందుకు వీరిద్దరే రహస్యంగా ఎందుకు భేటీ కావాలి? పార్టీ సీనియర్లతో సమావేశం కావచ్చు కదా అన్నది బీజేపీ శ్రేణుల ప్రశ్న.

మరింత లోతుకు వెళితే మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. గత ఆరు నెలల కాలంలో వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు మునిసిపల్ టిక్కెట్లను కండీషన్‌గా పెట్టి పార్టీలోకి వచ్చేందుకు మొగ్గు చూపారు. అయితే టిక్కెట్లపై హామీ ఇవ్వలేని పరిస్థితిలో వారికి అప్పట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా మునిసిపల్ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ గైడ్ లైన్స్ వచ్చిన నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్‌ను మునిసిపల్ ఏరియాల్లో పెద్ద ఎత్తున చేపట్టేందుకు వీరిద్దరు సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని కిషన్ రెడ్డి దగ్గర ప్రస్తావిస్తే.. ఆయన అది నిజమే కానీ.. అంటూ ఇంకా ఏదో వుంది అన్న సంకేతాలిచ్చారు. సో.. ఆ ‘‘ ఇంకేదో ’’ ఏంటన్నది కమలం శ్రేణుల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Related Tags