Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

దారుణం: తాగే ద్రావకం అనుకోని..పురుగుల మందు తాగి..

Two little boys drink pesticides, దారుణం: తాగే ద్రావకం అనుకోని..పురుగుల మందు తాగి..

విధి..మనుషుల జీవితాలతో ఎలా ఆడుకుంటుందో చెప్పడానికి ఇప్పుడు చెప్పబోయే ఘటన ప్రత్యక్ష ఉదాహారణ. పురుగుల మందు డబ్బాను తాగే ద్రావకం భావించిన ఇద్దరు చిన్నారులు.. దాన్ని సేవించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం పిట్టలగూడెంలో జరిగింది.

అప్పటివరకు ఆ చిన్నారులు బడిలో చదువుకోని వచ్చారు. సాయంకాలం సమయం కావడంతో..ఆటవిడుపు కోసం బయటకి వెళ్లారు. కానీ అదే వాళ్ల ప్రాణాలను హరిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆటల మధ్యలో ఓ చెట్టు పక్కనే ఉన్న డబ్బాపై చిన్నారుల దృష్టి పడింది. దాన్ని తాగే ద్రావకంగా భావించిన వారు వెంటనే ఇంటికి తీసుకువచ్చి..గ్లాసుల్లో పోసుకుని తాగేశారు. పెద్దలెవరూ గమనించికపోవడంతో ఊహించని విషాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటికే నొట్లో నురగలతో..అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఇద్దరు చిన్నారులను చేర్యాల గవర్నమెంట్ హాప్పటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ అందిస్తుండగా ఒకరు..మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట హాస్పటల్‌కి తరలిస్తుండగా మరొకరు తనువు చాలించారు. ఊహించని ఈ పరిణామంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. చనిపోయిన చిన్నారులను తుమ్మల రమేశ్‌ కుమారుడు భాస్కర్‌ (13), కాలియ లక్ష్మణ్‌ కుమారుడు బన్నీ (11) లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టారు.