మరో ఉగ్ర కుట్ర భగ్నం.. పట్టుబడ్డ జైషే ఉగ్రవాదులు..!

దేశంలో అలజడి సృష్టించేందుకు ప్లాన్ వేస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు భారత్ బ్రేకులు వేస్తోంది. ఇప్పటి వరకు దేశంలో చొరబడేందుకు సరిహద్దుల వెంబడి తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. ఎప్పటికి అప్పుడు భారత సైన్యం తిప్పికొడుతుంది. మరోవైపు ఉగ్రవాదుల ఏరివేత దిశగా జమ్ముకశ్మీర్‌ను జల్లెడ పడుతున్నారు పోలీసులు. తాజాగా మరోసారి చేపట్టిన తనిఖీల్లో ఇద్దరు జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు పోలీసులకు పట్టుబడ్డారు.దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం పోలీసులు తనిఖీలు చేపడుతుండగా ఈ ఇద్దరు ఉగ్రవాదులను […]

మరో ఉగ్ర కుట్ర భగ్నం.. పట్టుబడ్డ జైషే ఉగ్రవాదులు..!
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2019 | 1:54 AM

దేశంలో అలజడి సృష్టించేందుకు ప్లాన్ వేస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు భారత్ బ్రేకులు వేస్తోంది. ఇప్పటి వరకు దేశంలో చొరబడేందుకు సరిహద్దుల వెంబడి తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. ఎప్పటికి అప్పుడు భారత సైన్యం తిప్పికొడుతుంది. మరోవైపు ఉగ్రవాదుల ఏరివేత దిశగా జమ్ముకశ్మీర్‌ను జల్లెడ పడుతున్నారు పోలీసులు. తాజాగా మరోసారి చేపట్టిన తనిఖీల్లో ఇద్దరు జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు పోలీసులకు పట్టుబడ్డారు.దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం పోలీసులు తనిఖీలు చేపడుతుండగా ఈ ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా మండుగుండు సామాగ్రితో పాటు.. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కథువా జిల్లాలో పట్టుబడిన ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతో ఈ ఇద్దర్ని పట్టుకున్నారు.

పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకర్ని లారీ ఓనర్ సుహిల్ అహ్మద్ లాతూ, మరోకరు రాజ్‌పురకు చెందిన బషీర్ అహ్మద్‌గా గుర్తించారు. ఇద్దర్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జైషే మహ్మద్ చేపడుతున్న కార్యకలాపాలపై వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు అరెస్ట్ అయ్యారు. అయితే మరింత మంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం జమ్ము, పఠాన్ కోట్ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో ఓ ఆయుధాలతో కూడిన లారీని సీజ్ చేశారు. అందులో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రితో పాటు, ఏకే 47, ఏకే 56 గన్స్‌ను గుర్తించారు. వాటితో పాటుగా మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా పట్టుబడ్డారు. దీంతో లారీని సీజ్ చేసి విచారణ చేపట్టారు.

జమ్ముకశ్మీర్‌ స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారత్‌లో దాడులకు పాక్ కుట్రలు పన్నుతోంది. ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఉగ్రవాదులను దేశంపైకి ఉసిగొల్పుతుందంటూ నిఘావర్గాలు పలుమార్లు హెచ్చిరంచాయి.