కుక్కల్ని సంచులతో కట్టేసి తరలిస్తున్న ముఠా.. విషయం తెలిస్తే షాక్..

పశువుల్ని అక్రమంగా తరలిస్తున్న సంఘటనలు అనేకం చూశాం. అందులో ముఖ్యంగా మేకలు, గోవులు అక్రమంగా వాహనాల్లో తరలిస్తున్న అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే కుక్కల్ని అక్రమంగా బంధించి తీసుకెళ్లడం మాత్రం చాలా అరుదు. అది కూడా వీధి కుక్కల్ని. వినడానికి ఇది వింతగా ఉన్నా.. ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర-మిజోరాం సరిహద్దులో జరిగిన సంఘటన చూస్తే షాక్ తినాల్సిందే. వివరాల్లోకి వెళితే.. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో కుక్క మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉందట. దీంతో ఇద్దరు వ్యక్తులు […]

కుక్కల్ని సంచులతో కట్టేసి తరలిస్తున్న ముఠా.. విషయం తెలిస్తే షాక్..
Follow us

| Edited By:

Updated on: Dec 30, 2019 | 2:36 AM

పశువుల్ని అక్రమంగా తరలిస్తున్న సంఘటనలు అనేకం చూశాం. అందులో ముఖ్యంగా మేకలు, గోవులు అక్రమంగా వాహనాల్లో తరలిస్తున్న అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే కుక్కల్ని అక్రమంగా బంధించి తీసుకెళ్లడం మాత్రం చాలా అరుదు. అది కూడా వీధి కుక్కల్ని. వినడానికి ఇది వింతగా ఉన్నా.. ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర-మిజోరాం సరిహద్దులో జరిగిన సంఘటన చూస్తే షాక్ తినాల్సిందే.

వివరాల్లోకి వెళితే.. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో కుక్క మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉందట. దీంతో ఇద్దరు వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. వీధి కుక్కల్ని టార్గెట్ చేసుకుని.. అక్రమ దందాకు తెరలేపారు. త్రిపురలో ఉన్న వీధి కుక్కల్ని పట్టుకుని.. వాటిని జనపనార సంచుల్లో కట్టేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 కుక్కల్ని ఇలా కట్టేశారు. అనంతరం వాటిని కారులో కుక్కేసి.. మిజోరాం తరలించేందుకు బయలుదేరారు. అయితే ఈ క్రమంలో త్రిపుర – మిజోరాం సరిహద్దు వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు.. వీరికి చెక్ పెట్టారు. అనుమానాస్పదంగా కన్పించడంతో.. వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు చెప్పిన విషయాన్ని విన్న పోలీసులు షాక్ తిన్నారు. మిజోరాంలో కుక్క మాంసానికి భారీ డిమాండ్ ఉండటంతో.. త్రిపుర నుంచి ఈ కుక్కల్ని తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో శునకాన్ని రూ. 2000-2500 వరకు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు.