పుల్వామా తరహా మరో ఆత్మాహుతి దాడికి సిద్ధమైన జైషే మహ్మద్

న్యూఢిల్లీ : పుల్వామా వంటి మరో ఉగ్రదాడి జరిపేందుకు జైషే మహ్మద్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14న ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. తాజాగా, పుల్వామా తరహా మరో దాడికి జైష్ స్కెచ్ వేసిందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. రానున్న 3, 4 రోజుల్లో జమ్ముకశ్మీర్ లో దాడి చేసేందుకు జైష్ యత్నిస్తోందని తెలిపింది. బాలాకోట్ […]

పుల్వామా తరహా మరో ఆత్మాహుతి దాడికి సిద్ధమైన జైషే మహ్మద్
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 6:30 PM

న్యూఢిల్లీ : పుల్వామా వంటి మరో ఉగ్రదాడి జరిపేందుకు జైషే మహ్మద్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14న ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. తాజాగా, పుల్వామా తరహా మరో దాడికి జైష్ స్కెచ్ వేసిందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. రానున్న 3, 4 రోజుల్లో జమ్ముకశ్మీర్ లో దాడి చేసేందుకు జైష్ యత్నిస్తోందని తెలిపింది. బాలాకోట్ లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన చేసిన దాడులకు ప్రతీకారంగా జైష్ ఈ దాడికి పాల్పడబోతోందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. హైఅలర్ట్ ప్రకటించారు.

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. శిక్షణ పొందిన ఉగ్రవాదులు రెండు బృందాలుగా విడిపోయి ఎల్‌వోసీ నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కోట్లీ ఉగ్రవాద స్థావరం నుంచి అధీనరేఖ ప్రాంతంలోని నిఖియాల్ సెక్టార్‌కు ఐదుగురు టెర్రరిస్టుల బృందం ఒక వాహనంలో వచ్చినట్లు గుర్తించారు.

మరో బృందంలో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన ఆరుగురు టెర్రరిస్టుల కదలికలను ఎల్‌వోసీకి సమీపంలోని మోహ్ర ష్రీడ్ గ్రామంలో గుర్తించారు. వీరంతో సరైన సమయం చూసుకొని భారత్‌లోకి చొరబడేందుకు వేచిచూస్తున్నట్లు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. వీరందరికి పాకిస్థాన్ ఆర్మీకి చెందిన కొంతమంది స్పెషల్ సర్వీస్ గ్రూప్ సభ్యులు అన్ని విధాల సహకరిస్తూ.. నియంత్రణ రేఖ దాటించేందుకు సహయపడుతున్నారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల ప్రకారం దక్షిణ కశ్మీర్ లోని క్వాజీగుండ్, అనంత్ నాగ్ ప్రాంతాల్లో ఐఈడీ దాడి జరిగే అవకాశం ఉంది.