గేదె పేడ విషయంలో గొడవ..రెండు వర్గాల మధ్య ఘర్షణ

గేదె పేడ విషయంలో తలెత్తిన వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మాటమాట పెరిగిపోవటంతో ఇరువర్గాల వారు పరస్పర దాడులకు పాల్పడ్డారు.

గేదె పేడ విషయంలో గొడవ..రెండు వర్గాల మధ్య ఘర్షణ
Follow us

|

Updated on: Aug 27, 2020 | 12:10 PM

గేదె పేడ విషయంలో తలెత్తిన వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మాటమాట పెరిగిపోవటంతో ఇరువర్గాల వారు పరస్పర దాడులకు పాల్పడ్డారు. జరిగిన దాడిలో పలువురికి తీవ్రగాయాలు కాగా, ఆస్పపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

గుంటూరు జిల్లాలో నాదెండ్ల మండలం కనపర్రులో గేదె పేడ విషయంలో వివాదం చెలరేగింది. రెండు వర్గాల మధ్య మాట మాటా పెరగిపోయి తీవ్ర ఘర్షణకు దారితీసింది. వివాదం రాజకీయంగా మారి. టీడీపీ-వైసీపీ గ్రూపులుగా విడిపోయిన రెండు వర్గాల వారు చితక్కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనస్థలం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు స్థానికులు, పోలీసుల జోక్యంతో క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణలో గాయపడినవారిలో వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఇరుపార్టీల నేతలు వచ్చి పరామర్శించినట్లుగా సమాచారం. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.