జీహెచ్ఎంసీ ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం.. ఇద్దరు అధికారులపై జిల్లా కలెక్టర్ వేటు..

ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతర్ చేసిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల విధులకు నియమించిన ఇద్దరు అధికారు డుమ్మా కొట్టారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం.. ఇద్దరు అధికారులపై జిల్లా కలెక్టర్ వేటు..
Follow us

|

Updated on: Nov 28, 2020 | 9:45 PM

ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతర్ చేసిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల విధులకు నియమించిన ఇద్దరు అధికారు డుమ్మా కొట్టారు. వనపర్తి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ పర్యవేక్షకుడు వరప్రసాద్‌ను, ఆర్అండ్‌బీ అసిస్టెంట్ ఇంజినీర్ కృష్ణమోహన్‌లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27 న గ్రేటర్ ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని లిఖితపూర్వక సమాచారం అందించారు. అయినప్పటికీ ఇద్దరు అధికారులు శిక్షణ తరగతులకు హాజరు కాలేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు జిల్లా కలెక్టర్. వరప్రసాద్‌కు అధికారులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని, అదేవిధంగా ఆర్అండ్‌బీ అసిస్టెంట్ ఇంజినీర్ కృష్ణ మోహన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని వెల్లడించారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వీరిని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ యాస్మిన్ బాష ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.