వావ్.. తెలంగాణకు ఒకటి కాదు.. రెండు శుభవార్తలు…

తెలంగాణకు సంబంధించి రెండు శుభవార్తలు.. ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉండటం మొదటిదైతే.. ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు పైపైకి రావడం రెండోది.. నిజంగానే ఈ రెండూ శుభ సంకేతాలు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలోనే … అదీ కేసీఆర్‌ సారథ్యంలోని తెలంగాణ సాధించిన అద్భతమైన ప్రగతి ఇది.. అనూహ్యమైన మార్పు ఇది..తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారత ఆహారసంస్థ రికార్డు స్థాయిలో బియ్యాన్ని తెలంగాణ పౌర సరఫరాల శాఖ నుంచి సేకరించనుంది.. యాసంగి సీజన్‌లో తెలంగాణలో […]

వావ్.. తెలంగాణకు ఒకటి కాదు.. రెండు శుభవార్తలు...
Follow us

| Edited By:

Updated on: May 09, 2020 | 11:30 AM

తెలంగాణకు సంబంధించి రెండు శుభవార్తలు.. ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉండటం మొదటిదైతే.. ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు పైపైకి రావడం రెండోది.. నిజంగానే ఈ రెండూ శుభ సంకేతాలు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలోనే … అదీ కేసీఆర్‌ సారథ్యంలోని తెలంగాణ సాధించిన అద్భతమైన ప్రగతి ఇది.. అనూహ్యమైన మార్పు ఇది..తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారత ఆహారసంస్థ రికార్డు స్థాయిలో బియ్యాన్ని తెలంగాణ పౌర సరఫరాల శాఖ నుంచి సేకరించనుంది.. యాసంగి సీజన్‌లో తెలంగాణలో ఇంతగా వరి పండుతుందని ఎవరైనా ఊహించామా? ఎప్పుడైనా అనుకున్నామా..? ఇప్పటికే దేశ వ్యాప్తంగా 45 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, ఇందులో తెలంగాణ వాటానే 30 లక్షల టన్నులు.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పది లక్షల టన్నులను సేకరించింది.. దేశంలోని మిగతా రాష్ట్రాల నుంచి సేకరించింది కేవలం అయిదు లక్షల టన్నులే.. యాసంగిలో తెలంగాణ సాధించిన వరిధాన్యం దిగుబడి అందరిని ఆశ్చర్యచకితులను చేస్తోంది.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలంగాణ వస్తే ఏం జరుగుతుందని ఎకసెక్కాలు ఆడినవారికి మొహంమీద కొట్టినట్టుగా ఇచ్చిన జవాబు ఇది! సాగునీటి ప్రాజెక్టులు సాకారమవుతున్నాయి.. కాలువలు పారుతున్నాయి.. చెరువులు నిండుతున్నాయి.. భూగర్భ జలాలు పెరుగుతున్నాయి.. నీటి వనరులు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చాయి.. ఇవన్నీ యాసంగిలో ధాన్యం దిగుబడి పెరగడానికి కారణాలయ్యాయి.. ధాన్యం కొనుగోళ్లలో కూడా తెలంగాణ రాష్ట్రమే ముందున్నది.. ఆ ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి అందజేయడంలో కూడా టాప్‌లో నిలిచింది. యాసంగి సీజన్‌లో తెలంగాణలో దాదాపు 90 లక్షల ధాన్యం పండే అవకాశం ఉన్నదన్నది ఓ అంచనా. తెలంగాణ చరిత్రలో ఈ స్థాయిలో ధాన్యం పండించడం ఇదే మొదటిసారి.

ఇక కాళేశ్వరం ప్రాజెక్టు.. మిషన్‌ కాకతీయ.. గొలుసుకట్టు చెరువుల ఫలితంగా భూగర్భ జలమట్టాలు యేటికేడు పెరుగుతూ వస్తున్నాయి.. అన్నదాతల్లో ఆనందం నింపుతున్నాయి.. పాతాళగంగ పైపైకి వచ్చేస్తోంది. భూగర్భ జలమట్టాలు పెరుగుతున్నాయ్. రాష్ట్రంలో అధికవర్షపాతం, మిషన్ కాకతీయ, గొలుసుకట్టు చెరువులు, కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భంలో జలమట్టాలు ప్రతియేటా అంతకంతకూ పెరగడం అన్నదాతల్లో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషే..! ఆ దార్శనికుడి ప్రయత్న ఫలమే..! మిషన్ కాకతీయతో పాడుబడిన చెరువులకు జలకళ తెప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్లు, వాటి ద్వారా చెరువులు నింపి భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు పాటుపడ్డారు. . . వేసవి సీజన్‌లో ఏప్రిల్‌లో పలు జిల్లాల్లో జలమట్టాలు గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే బాగా పెరిగాయి. నీటి సంవత్సరాన్ని సాధారణంగా జూన్‌ నుంచి మరుసటి ఏడాది మే మాసం వరకూ లెక్కిస్తారు. ఆ లెక్కన 2019 జూన్ నుంచి 2020 ఏప్రిల్ వరకూ రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జల మట్టాలెలా ఉన్నాయనేది భూగర్భ జలశాఖ 966 చోట్ల అధ్యయనం చేసింది. అంతేకాదు మొత్తం 13 జిల్లాల్లో సాధారణంకన్నా 23 నుంచి 46 శాతం దాకా అధిక వర్షపాతం నమోదైనట్టు గుర్తించారు. రాష్ట్రంలో సగటున 11.05 మీటర్ల లోతున భూగర్భ జల మట్టాలున్నాయి. వనపర్తి జిల్లాలో 4.66 మీటర్ల లోతున, మెదక్‌ జిల్లాలో 22.12 మీటర్ల కింద నీరుంది. 2019 ఏప్రిల్‌తో పోలిస్తే 2020 ఏప్రిల్‌లో సగటున రాష్ట్రంలో 3.09 మీటర్ల వరకూ భూగర్భ జల మట్టాలు పెరిగాయి. మొత్తంగా తెలంగాణ ఆకుపచ్చవర్ణాన్ని సంతరించుకుంటోంది.