ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయిన ఇద్దరమ్మాయిలు

కర్నూలులో ఒక వింతైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు గాఢంగా ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయారు. దీంతో ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పట్టణంలోని సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన ఒక యువతి (21), నర్సింహారెడ్డినగర్ నగర్‌కు చెందిన మరో యువతి (20) చిన్ననాటినుంచి మంచి స్నేహితులు. వారి స్నేహం పెరిగి పెద్దవాళ్లయ్యే సరికి మరింత ముదిరి ప్రేమగా పరిణమించింది. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితిలో ఈ నెల 3న ఇంట్లో చెప్పకుండా ఇద్దరూ […]

  • Venkata Narayana
  • Publish Date - 10:57 am, Thu, 5 November 20

కర్నూలులో ఒక వింతైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు గాఢంగా ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయారు. దీంతో ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పట్టణంలోని సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన ఒక యువతి (21), నర్సింహారెడ్డినగర్ నగర్‌కు చెందిన మరో యువతి (20) చిన్ననాటినుంచి మంచి స్నేహితులు. వారి స్నేహం పెరిగి పెద్దవాళ్లయ్యే సరికి మరింత ముదిరి ప్రేమగా పరిణమించింది. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితిలో ఈ నెల 3న ఇంట్లో చెప్పకుండా ఇద్దరూ కలిసి వెళ్లిపోయారు. అంతేకాదు, తల్లిదండ్రులకు మెసేజ్ కూడా పెట్టారు. అది చూసి కంగారుపడిన ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి తమ పిల్లల జాడ తెలుసుకోవాలంటూ అభ్యర్థించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతుల కోసం గాలింపు మొదలుపెట్టారు.