Breaking News : ధరణి నమోదులో నిర్లక్ష్యం.. ఇద్దరు అధికారులపై వేటు

ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతోంది? అనే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హైదరాబాద్‌లో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేపట్టారు. సైదాబాద్‌లోని లక్ష్మీనగర్‌ కాలనీకి వెళ్లిన సీఎస్.. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌ మంగతాయారుపై సస్పెన్షన్ వేటు వేశారు.

Breaking News : ధరణి నమోదులో నిర్లక్ష్యం.. ఇద్దరు అధికారులపై వేటు
Follow us

|

Updated on: Oct 11, 2020 | 5:03 PM

Dharani Registrations : ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతోంది? అనే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హైదరాబాద్‌లో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేపట్టారు. సైదాబాద్‌లోని లక్ష్మీనగర్‌ కాలనీకి వెళ్లిన సీఎస్.. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌ మంగతాయారుపై సస్పెన్షన్ వేటు వేశారు.

ధరణి రిజిస్ట్రేషన్ల విషయంలో అలసత్వం ప్రదర్శించారంటూ జోనల్ కమిషనర్ మంగతాయారుతో పాటు.. ఎన్యూమరేటర్‌ మాధురిని సైతం సస్పెండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ధరణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆస్తుల సర్వే మందకొడిగా సాగుతుండడంపై సీఎస్ సోమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆస్తులు ఆన్‌లైన్ చేయడంలో అలసత్వం ప్రదర్శించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏస్థాయి అధికారులైనా వేటు తప్పదని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆస్తుల సర్వే వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.