ఈ కాలంలోనూ బాణాలే కత్తులు..

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. కొట్టాల చెరువు గ్రామంలో డబ్బుల విషయంలో ఇద్దరి స్నేహితుల మధ్య చెలరేగిన వివాదం పరస్పర దాడులకు దారితీసింది. అప్పుగా తీసుకున్న డబ్బులు అడిగినందుకు స్నేహితుడు లింగన్నపై అంకన్న అనే వ్యక్తి బాణాలతో దాడి చేశాడు. మద్యం మత్తులో కిరాతకంగా స్నేహితుడిపై విల్లంబులతో విరుచుకుపడ్డాడు. బాణాల దాడిలో లింగన్నకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తమోడుతున్న లింగన్నకు చికిత్స కోసం దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతని పరిస్థితి విషమంగా […]

ఈ కాలంలోనూ బాణాలే కత్తులు..
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2019 | 11:45 AM

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. కొట్టాల చెరువు గ్రామంలో డబ్బుల విషయంలో ఇద్దరి స్నేహితుల మధ్య చెలరేగిన వివాదం పరస్పర దాడులకు దారితీసింది. అప్పుగా తీసుకున్న డబ్బులు అడిగినందుకు స్నేహితుడు లింగన్నపై అంకన్న అనే వ్యక్తి బాణాలతో దాడి చేశాడు. మద్యం మత్తులో కిరాతకంగా స్నేహితుడిపై విల్లంబులతో విరుచుకుపడ్డాడు.

బాణాల దాడిలో లింగన్నకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తమోడుతున్న లింగన్నకు చికిత్స కోసం దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి వ్యక్తుల మధ్య బాణాల దాడి జరగడంతో కొట్టాల చెరువు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గ్రామంలో ఇరువర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడులు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో.. గ్రామంలో ఎప్పుడేం జరుగుతుందో అని గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు.