Farmers’ Protest : రైతు సంఘాల్లో చీలిక.. పోరాటం నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన రెండు పెద్ద యూనియన్లు

జనవరి 26న ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్​ ర్యాలీ అనంతరం రైతు సంఘాల్లో చీలిక ఏర్పడింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతు సంఘాల్లో రెండు రైతు సంఘాలు..

Farmers' Protest : రైతు సంఘాల్లో చీలిక.. పోరాటం నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన రెండు పెద్ద యూనియన్లు
Follow us

|

Updated on: Jan 27, 2021 | 9:25 PM

Farmers’ Protest : జనవరి 26న ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్​ ర్యాలీ అనంతరం రైతు సంఘాల్లో చీలిక ఏర్పడింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతు సంఘాల్లో రెండు రైతు సంఘాలు తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న నిరసన నుంచి భారతీయ కిసాన్ యూనియన్ (భాను), రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్ రైతు సంఘాలు సంచలన ప్రకటన చేశాయి. కాగా, ఈ ప్రకటన అనంతరం ఢిల్లీ సమీపంలోని చిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన బారీకేడ్లను పోలీసులు తొలగించారు.

చిల్లా సరిహద్దులోనే భారతీయ కిసాన్ యూనియన్ (భాను) వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోంది. అయితే గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకమంగా మారడంతో ప్రస్తుతం కొనసాగుతున్న నిరసనను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లుగా బీకేయూ నేతలు వెల్లడించారు. చిల్లా సరిహద్దులో కొనసాగిన నిరసనలో బీకేయూదే ప్రధాన పాత్ర. అయితే బీకేయూ ప్రకటనతో చిల్లా సరిహద్దు దాదాపుగా ఖాళీ అనే చెప్పుకోవాలి. ఈ నేపధ్యంలో ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన బారీకేడ్లను పోలీసులు తొలగించారు.