Dogs Identify Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్‌ని గుర్తించి ఆమెను రక్షించిన శునకాలు.. వావ్ !

Dogs Identify Breast Cancer:  ఆమె పేరు  లిండా ముంక్‌లే. వయస్సు 65 ఏళ్ళు.. తను ముద్దుగా పెంచుకుంటున్న నాలుగు కుక్కల్లో రెండు కుక్కలకు అదే పనిగా కృతజ్ఞతలు చెప్పుకుంటోంది. వాటి రుణం తీర్చుకోలేనని, అవి తన ప్రాణదాతలని ఆకాశానికి ఎత్తేస్తోంది. కారణం.. తనకు సోకిన బ్రెస్ట్ క్యాన్సర్ ని అవి గుర్తు పట్టాయట. బియా, ఎన్యా అనే ఈ శునకాలు మొదట్లో వింతగా ప్రవర్తించడం ప్రారంభించాయని ఆమె వెల్లడించింది. తను సోఫాలో కూర్చోగానే.. అవి తరచూ […]

Dogs Identify Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్‌ని గుర్తించి ఆమెను రక్షించిన శునకాలు.. వావ్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 15, 2020 | 5:33 PM

Dogs Identify Breast Cancer:  ఆమె పేరు  లిండా ముంక్‌లే. వయస్సు 65 ఏళ్ళు.. తను ముద్దుగా పెంచుకుంటున్న నాలుగు కుక్కల్లో రెండు కుక్కలకు అదే పనిగా కృతజ్ఞతలు చెప్పుకుంటోంది. వాటి రుణం తీర్చుకోలేనని, అవి తన ప్రాణదాతలని ఆకాశానికి ఎత్తేస్తోంది. కారణం.. తనకు సోకిన బ్రెస్ట్ క్యాన్సర్ ని అవి గుర్తు పట్టాయట. బియా, ఎన్యా అనే ఈ శునకాలు మొదట్లో వింతగా ప్రవర్తించడం ప్రారంభించాయని ఆమె వెల్లడించింది. తను సోఫాలో కూర్చోగానే.. అవి తరచూ తన ఛాతీ భాగాన్ని తమ తలలతో ఢీకొడుతుంటే  తొలుత పట్టించుకోకపోయినా.. నెలలతరబడి అలాగే ప్రవర్తిస్తూ రావడంతో ఆశ్చర్యపోయానని ఆమె తెలిపింది. గతంలో  ఎప్పుడూ ఆ జాగిలాలు అలా చేయలేదని చెప్పిన ఆమె.. తనకు కలిగిన అనుమానంతో ఆసుపత్రికి వెళ్లి …ఎందుకైనా మంచిదని మామోగ్రామ్ పరీక్ష చేయించుకోగా. .తనకు బ్రెస్ట్ క్యాన్సర్‌కు కారణమైన కణితి వంటిది ఛాతీ భాగంలో పెరుగుతోందని కన్ఫామ్ అయిందట. చివరకు డాక్టర్లు ఆమెకు ఇఛ్చిన ట్రీట్ మెంట్ సక్సెస్ కావడంతో ఆ క్యాన్సర్ బారి నుంచి విముక్తురాలైంది. తన కుక్కల ప్రవర్తన గురించి వైద్యులకు చెప్పినప్పుడు వారు కూడా ఆశ్చర్యపోయారని లిండా వెల్లడించింది. పూర్తిగా కోలుకుని నేను ఇంటికి వచ్చాక.. బియా, ఎన్యా  శునకాలు గతంలోలా ప్రవర్తించలేదని. మామూలుగానే ఉంటూ వచ్చాయని ఆమె పేర్కొంది. బ్రిటన్ లోని వేల్స్‌లో నివసించే లిండా… తన ప్రాణదాతలైన ఈ కుక్కల వైనాన్నిఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.