కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్.. ఇలా అయితే కష్టమే ఇక..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో.. రాజకీయాలు కూడా హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్.. ఇలా అయితే కష్టమే ఇక..
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 3:24 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో.. రాజకీయాలు కూడా హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.. మరోవైపు కర్ణాటకలో కూడా రాజకీయ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇందుకు కారణం.. యెడ్డీ సర్కార్‌ను కూల్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్న వార్తలు రావడమే. ఇదిలావుంటే.. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ ఎన్నికలకు ముందు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు వారి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కర్జాన్ ఎమ్మెల్యే అక్షయ్ పటేల్, కప్రాద ఎమ్మెల్యే జితూ చౌదరిలు.. రాజీనామా పత్రాలను స్పీకర్ రాజేంద్ర త్రివేదీకి అందజేశారు. అయితే వెంటనే వీరి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు.

గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 మంది సభ్యులున్నారు. వీరిలో 103 మంది బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండగా.. 68 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు బీజేపీ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు బరిలో ఉన్నారు. అయితే గుజరాత్ రాష్ట్రం నుంచి నలుగురు మాత్రమే రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా చేయడంతో.. పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇలాగే మరికొందరు కూడా రాజీనమా చేస్తే.. కాంగ్రెస్ పార్టీ మరింత కష్టాల్లో పడనుంది.