మణుగూరు- సికింద్రాబాద్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌‌లో మంటలు

Two coaches of Manuguru-Secunderabad Super Fast Express catch fire in kothagudem, మణుగూరు- సికింద్రాబాద్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌‌లో మంటలు

మణుగూరు- సికింద్రాబాద్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ అగ్నిప్రమాదానికి గురైంది. షార్ట్‌ సర్క్యూట్‌తో రెండు బోగీలలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో చోటుచేసుకుంది. ఏ1, బీ1 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ట్రైన్ దిగి పట్టాలపై పరుగులు పెట్టారు. కొత్తగూడెం స్టేషన్లో రైలును నిలిపేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *