Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

బ్యాంక్ ఉద్యోగుల చేతివాటం..చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి నగదు స్వాహా..

Two bank staff booked for swindling money from dead customer's account, బ్యాంక్ ఉద్యోగుల చేతివాటం..చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి నగదు స్వాహా..

కొందరు బ్యాంక్ ఉద్యోగులు మరీ బరితెగిస్తున్నారు. టైమ్ టూ టైమ్ భారీగా జీతాలు వస్తున్నా కూడా ..అక్రమ సొమ్ము కోసం తప్పుడు మార్గాలను అన్వేశిస్తున్నారు. ఇప్పటికే అనేకచోట్ల నకిలీ లోన్లు, స్వయం చేతివాటాలు, ఫేక్ చోరీలు సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో కొత్త పద్దతిలో నిధుల స్వాహాకి తెరతీశారు ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు.  చనిపోయిన వ్యక్తి  బ్యాంక్ అకౌంట్  నుంచి 25 లక్షల 8 వేలను తమ జేబుల్లోకి మళ్ళించుకున్నారు. తమిళనాడు.. వయలూర్‌లోని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌‌లో ఈ స్కామ్ చోటుచేసుకుంది. నిధులు మళ్లించుకుంది కూడా పెద్ద తలలైన ..మేనేజర్‌ షేక్‌ మోహిద్దీన్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ చిన్నాదురై .

ఎమిసోలా అనే మహిళకు వయలూర్‌లోని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌‌ అకౌంట్ ఉంది. ఆమె ఖాతా నుంచి కొన్నాళ్ల వరకు బాగానే జరిగిన లావాదేవీలు సడన్‌గా ఆగిపోయాయి.   కొన్ని సంవత్సరాల క్రితం ఆమె చనిపోవడంతో అకౌంట్ స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. కాగా ఆ అకౌంట్‌లో సొమ్ము మాత్రం అలానే ఉంది. అందులో ప్రతి సంవత్సరం ఇంట్రస్ట్ కూడా జమ అవుతోంది. ఇక ఆ డబ్బుకోసం ఎవరూ రారులే అని భావించిన మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ షేర్ వేసుకోని సొమ్ము పంచుకోవాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తరువాయి నకిలీ సంతకాన్ని సృష్టించి, ఏటీఎం కార్డుతో డబ్బు విత్ డ్రా చెయ్యడం మొదలెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన ఈ వ్యవహారం..సంస్థ సంవత్సర ఆడిట్ రిపోర్ట్‌లో బట్టబయలైంది. దీంతో ప్రస్తుతం ఆ ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయిస్ ఊచలు లెక్కబెడుతున్నారు.