తామరపూల కోసం వెళ్లి..అయ్యప్ప భక్తులు మృత్యువాత..

వారు అయ్యప్ప మాలలో ఉన్నారు. ఆ హరిహరుల పుత్రుడిని ఎంతో భక్తితో కొలుస్తున్నారు. అప్పుడు కూడా ఆ స్వామి అలంకారం కోసం తామరపూలను తెద్దామని వెళ్లారు. కానీ అంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు అయ్యప్ప మాలలో ఉన్న భక్తులు  చెరువులోనే మునిగిపోయి తనువు చాలించారు. విశాఖ జిల్లా పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..అయ్యప్ప మాల ధరించిన నరేశ్, గణేశ్..మరో యువకుడు కలిసి యలమంచిలి మండలం పెనుమర్రు చెరువు వద్దకు తామర పువ్వుల కోసం […]

తామరపూల కోసం వెళ్లి..అయ్యప్ప భక్తులు మృత్యువాత..
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2019 | 10:47 AM

వారు అయ్యప్ప మాలలో ఉన్నారు. ఆ హరిహరుల పుత్రుడిని ఎంతో భక్తితో కొలుస్తున్నారు. అప్పుడు కూడా ఆ స్వామి అలంకారం కోసం తామరపూలను తెద్దామని వెళ్లారు. కానీ అంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు అయ్యప్ప మాలలో ఉన్న భక్తులు  చెరువులోనే మునిగిపోయి తనువు చాలించారు. విశాఖ జిల్లా పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..అయ్యప్ప మాల ధరించిన నరేశ్, గణేశ్..మరో యువకుడు కలిసి యలమంచిలి మండలం పెనుమర్రు చెరువు వద్దకు తామర పువ్వుల కోసం వెళ్లారు. నరేష్, గణేష్ చెరువులోకి దిగగా…మూడో వ్యక్తి ఈత రాకపోవడంతో ఒడ్డునే ఉండిపోయాడు. కొంతదూరంవరకు బాగానే వెళ్లిన స్వాములు..ఆ తర్వాత కొద్దికొద్దిగా ఊబిలోకి దిగపోవడం ప్రారంభించారు. ఒడ్డున ఉన్న వ్యక్తి స్థానికులను అప్రమత్తం చేసేలోపే వారు పూర్తిగా నీటిలో మునిగిపోయారు. అక్కడ బుడుగు ఉందని స్వాములు గమనించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. కాగా ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు..మృతదేహాలను వెలికితీసి విచారణ చేస్తున్నారు.