యాంటీ వైరల్ డ్రగ్ బ్లాక్ మార్కెట్ గుట్టురట్టు

కరోనా కట్టడిలో ప్రభుత్వాలు తలలు పట్టుకుంటుంటే.. కొందరు దుండగులు మాత్రం యాంటీ వైరల్ డ్రగ్ బ్లాక్ మార్కెట్ చేస్తూ ప్రజల ప్రాణాలను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇలా గుట్టుచప్పుడు కాకుండా దందా నడుపుతున్న ఇద్దరు అన్నదమ్ముళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్ డ్రగ్స్‌ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ఇద్దరిని హైదరాబాద్ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యాంటీ వైరల్ డ్రగ్ బ్లాక్ మార్కెట్ గుట్టురట్టు
Follow us

|

Updated on: Jul 17, 2020 | 9:20 PM

కరోనా విజృంభణతో ప్రపంచ మొత్తం అల్లాడుతోంది. మాయదారి రోగంతో ఉపిరాడక కొందరు ప్రాణాలొదులుతున్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వాలు తలలు పట్టుకుంటుంటే.. కొందరు దుండగులు మాత్రం యాంటీ వైరల్ డ్రగ్ బ్లాక్ మార్కెట్ చేస్తూ ప్రజల ప్రాణాలను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇలా గుట్టుచప్పుడు కాకుండా దందా నడుపుతున్న ఇద్దరు అన్నదమ్ముళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్ డ్రగ్స్‌ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ఇద్దరిని హైదరాబాద్ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, 30 ఫ్యాబీ ఫ్లూ స్ట్రిప్పులు, 135 పల్స్ ఆక్సీమీటర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం 5 లక్షల 60 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సికింద్రాబాద్ కు చెందిన సోను అగర్వాల్, సునిల్ఆ ఆగర్వాల్ మందుల దుకాణం నిర్వహిస్తున్నారు. కరోనా బాధితుల అత్యవసర పరిస్థితులను ఆసరా చేసుకుని అధిక ధరలకు మందులను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్‌లో యాంటీ వైరల్ డ్రగ్ విక్రయిస్తుండగా పక్కా సమాచారంతో రాంగోపాల్ పేట, చిలుకలగూడలోని ఫార్మసీలపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు దాడులు నిర్వహించారు. సోను అగర్వాల్, ఆయన తమ్ముడు సునిల్ ఆగర్వాల్ అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కొంతకాలం ఫార్మసీ నడుపుతున్నారని, ఎలాంటి బిల్లులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అవసరమున్న వారికి యాంటీ వైరల్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, మూడు రోజుల క్రితం పోలీసులకు పట్టుబట్ట వెంకట సుబ్రహ్మణ్యం గ్యాంగ్ నుంచి వీరిద్దరూ ఆంటీ వైరల్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారి వ్యాపార సంస్థలపై పక్కా ప్రణాళికతో దాడి చేశారు అధికారులు.

డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం
డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..