“దృశ్యం” లెవల్లో.. కీర్తి క్రైం కహానీ.. ట్విస్టులు తెలిస్తే మైండ్ బ్లాక్..!!

సంచలనం సృష్టించిన రజిత మర్డర్ కేసుకు రాచకొండ పోలీసులు ఎండ్ కార్డు వేశారు. ఈ హత్య కేసులో నిందితులు కటకటాలపాలయ్యారు. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదైన రజిత కేసు.. ఆ తర్వాత మర్డర్ కేసుగా మారిందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. ఈ ఘటన అచ్చం దృశ్యం సినిమాను తలపించిందన్న సీపీ.. నిందితులు పోలీసులకు దొరక్కుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. 23 ఏళ్ల […]

దృశ్యం లెవల్లో.. కీర్తి క్రైం కహానీ.. ట్విస్టులు తెలిస్తే మైండ్ బ్లాక్..!!
Follow us

| Edited By:

Updated on: Oct 31, 2019 | 9:08 PM

సంచలనం సృష్టించిన రజిత మర్డర్ కేసుకు రాచకొండ పోలీసులు ఎండ్ కార్డు వేశారు. ఈ హత్య కేసులో నిందితులు కటకటాలపాలయ్యారు. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదైన రజిత కేసు.. ఆ తర్వాత మర్డర్ కేసుగా మారిందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. ఈ ఘటన అచ్చం దృశ్యం సినిమాను తలపించిందన్న సీపీ.. నిందితులు పోలీసులకు దొరక్కుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. 23 ఏళ్ల బాల్‌రెడ్డి కీర్తిని ఫ్రెండ్‌షిప్‌ పేరుతో అత్యాచారం చేసి గర్భవతిని చేశాడని.. శశికుమార్‌తో కలిసి ఆమంగల్‌లో కీర్తికి అబార్షన్‌ చేయించాడని సీపీ వెల్లడించారు. దీనిని అవకాశంగా తీసుకున్న శశికుమార్‌ విషయం తల్లికి చెబుతానంటూ కీర్తిని లొంగదీసుకున్నాడన్నారు. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందన్న కారణంతో ఈనెల 19న రజితను కీర్తి, శశికుమార్‌ హత్య చేశారన్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని రామన్నపేట్‌కి తరలించి అక్కడ రైల్వే ట్రాక్‌నూ పడేశారని తెలిపారు. కీర్తి రెడ్డి, శశికుమార్ పక్కా ప్లాన్ ప్రకారంతోనే ఈ హత్య చేశారని.. అంతకుముందు ఓ రోజే.. కీర్తి మత్తు గోలీలు ఇచ్చి రజితను చంపే ప్రయత్నం చేసిందన్నారు. ఈ ఘటనలో మొత్తం నాలుగు కేసులు నమోదు చేశామని తెలిపారు. బాలరెడ్డి పై 376 (2) (n) , 312 , section 5&6 పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయగా.. శశికుమార్, కీర్తి పై 302 , 201, 203 , రెడ్ విత్ 34- ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.