‘సీక్రెట్’ బయట పెట్టిన చైనా వైరాలజిస్ట్ ట్విటర్ ఖాతా క్లోజ్ !

కొవిడ్-19 వైరస్ ని  వూహాన్ ల్యాబ్ లో డెవలప్ చేశారని బహిరంగంగా ప్రకటించిన చైనీస్ వైరాలజిస్ట్ లీ-మెంగ్ యాన్ ట్విటర్ అకౌంట్ క్లోజ్ అయింది. తమ దేశ ప్రభుత్వం కావాలనే ఈ వైరస్ ని ఉత్పత్తి చేసి రిలీజ్ చేసిందని ఆమె ప్రకటించింది.

'సీక్రెట్' బయట పెట్టిన  చైనా వైరాలజిస్ట్ ట్విటర్ ఖాతా క్లోజ్ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 17, 2020 | 3:12 PM

కొవిడ్-19 వైరస్ ని  వూహాన్ ల్యాబ్ లో డెవలప్ చేశారని బహిరంగంగా ప్రకటించిన చైనీస్ వైరాలజిస్ట్ లీ-మెంగ్ యాన్ ట్విటర్ అకౌంట్ క్లోజ్ అయింది. తమ దేశ ప్రభుత్వం కావాలనే ఈ వైరస్ ని ఉత్పత్తి చేసి రిలీజ్ చేసిందని ఆమె ప్రకటించింది. దీంతో బుధవారం ఈమె అకౌంట్ ను ట్విటర్ మూసివేసింది. ‘అకౌంట్ సస్పెండెడ్.. ట్విటర్ సస్పెండ్స్ అకౌంట్స్ విచ్ వయోలేట్స్ ది ట్విటర్ రూల్స్’ అనే ఓ మెసేజ్ అక్కడ ప్రత్యక్షమైంది. ఐతే ఇందుకు స్పష్టంగా కారణాలను తెలియజేయలేదు. కరోనా వైరస్ కు సంబంధించిన వివాదాస్పద కంటెంట్ ను ట్వీట్స్ ను ఆపేస్తామంటూ ఈ సోషల్ జెయింట్ గత మే నెలలోనే  హెచ్చరించింది. కాగా-తన ఖాతా తొలగింపుపై స్పందించిన లీ-మెంగ్.. ఇలాంటి వారు వాస్తవాలను తెలుసుకోవడానికి ఇష్టపడరని వ్యాఖ్యానించింది. కోవిడ్ వైరస్ మనిషి చేసిందే తప్ప ..ప్రకృతి నుంచి వచ్చింది కాదని ఆమె పేర్కొంది.

చైనా ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని భయపడి ఈమె హాంకాంగ్ కి తన మకాంని మార్చింది. తనకే కాక, తన కుటుంబ సభ్యులకు కూడా  చైనా ప్రభుత్వం హాని తలపెట్టవచ్ఛునని  లీ భయపడుతోంది. అయితే ప్రపంచానికి నిజాలు తెలియజేస్తానని ధైర్యంగా చెబుతోంది. ఈ వైరస్ వూహాన్  లేబొరేటరీలో పుట్టిందని, ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయని ఈ వైరాలజిస్ట్ తెలిపింది.