ట్విట్టర్‌లో “అశోక చక్రం” ఎమోజీ

అశోక చక్రం.. మన త్రివర్ణ పతాకంలో ఉండే చిహ్నం. అయితే దీనిని ఎమోజీగా అందుబాటులోకి తీసుకొచ్చింది ట్విట్టర్. భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఈ ఎమోజీని అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ ప్రకటించింది. #indiaindependenceday అని పేర్కొంటూ అశోక చక్రం ఎమోజీని ట్విటర్‌ విడుదల చేసింది. ఇది ఆగస్టు 18 వరకు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మరో ఏడు ప్రాంతీయ భాషల ప్రజలు ఈ సింబల్‌ను ఉపయోగించుకునేలా అవకాశం కల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ట్విటర్‌లో స్వాతంత్ర్యదినోత్సవ హ్యాష్‌ట్యాగ్‌ పోస్ట్‌లలో ఈ ఎమోజీని ఉపయోగించుకోవచ్చు. భారతీయులకు ముఖ్యమైన సందర్భాలకు అనుగుణంగా ఎమోజీలను అందుబాటులోకి తీసుకురావడం ఎంతో స్పూర్తినిస్తోందన్నారు ఆ సంస్థ సీనియర్ మేనేజర్ కమ్రాన్‌. ఈ స్వాతంత్య్ర దినోత్సవ ఎమోజీ భారతీయులందరి మనసుల్లో దేశభక్తి  ప్రతి ధ్వనింపచేస్తుందనుకుంటున్నాని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *