Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,252 కేసులు, 467 మంది మృతి. దేశవ్యాప్తంగా7,19,665 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,59,557 యాక్టీవ్ కేసులు4,39,948 మంది డిశ్చార్జ్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • భారత్ బయోటెక్ ICMR సంయుక్తంగా నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ నిమ్స్ లో ప్రారంభం. ఇవ్వాళ ఆరోగ్య వతమైన వ్యక్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం. క్లినికల్ ట్రైల్స్ లో భాగం కానున్న 60 మంది. ఆరోగ్యంగా ఉండి క్లినికల్ ట్రయల్ కి సమ్మతించిన వారి రక్తనమూనాలను సేకరించి వివిధ రకాల వైద్య పరీక్షలు చేయనున్న నిమ్స్ ఆస్పత్రి.
  • విజయవాడ: స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. స్వరాజ్ మైదానంలో 20 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహంతో పాటు, పార్క్, మెమోరియల్ . ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి చెందిన భూమిని సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాం. రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. ఏడాదిలో మొత్తం ప్రోజెక్టు పూర్తి చేస్తాం. చంద్రబాబు హయాంలో అంబేద్కర్ విగ్రహం గ్రాఫిక్ కే పరిమితం చేశారు. ఎక్కడో ఊరికి చివరలో తూతూ మంత్రంగా శంకుస్థాపన చేశారు.
  • రెపటినుండి నిమ్స్ లో ప్రారంభం కానున్న క్లినికల్ ట్రైల్స్. ఏర్పాట్లను పూర్తి చేసిన నిమ్స్ యాజమాన్యం. ఎథిక్స్ కమిటీ అద్వర్యం లో జరగనున్న క్లినికల్ ట్రైల్స్.
  • సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్య అత్మహత్య కేసులో నింధితుల అరెస్ట్ . శంషాబాద్ సిఎస్ కె విల్లాస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని లావణ్య లహరి అత్మహత్య కేసులో నింధితులు మామ సుబ్బారావు ,అత్త రమాదేవి ,అడపడుచులు కృష్ణవేణి లక్ష్మీ కుమారిపై కేసు పమోదు . ప్రకాశం జిల్లా పిసిపల్లి మండలం లో అదుపులోకి తీసుకున్న పోలీసులు . నిందితులను హైదరాబాద్ కు తరలింపు.
  • పెద్ద అంబర్పేట్ అవుటర్ రింగ్ రోడ్డు పై ప్రమాదం. అవుటర్ రింగ్ రోడ్డు పై ఏపీ మంత్రి ఎస్కార్ట్ వాహనం బోల్తా. హెడ్ కానిస్టేబుల్ పాపయ్య మృతి మరో ముగ్గురు కానిస్టేబుల్లకి గాయాలు. ఏ పి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ అవ్వడం తో పల్టీ కొట్టిన బొలెరో వాహనం. ప్రమాదం లో గాయపడ్డ వారిని హయత్ నగర్ లోని హాస్పిటల్ కి తరలింపు. గచ్చిబౌలి నుండి విజయవాడకి వెళ్తుండగా ఘటన.

సోషల్ మీడియాపై ట్రంప్ అన్నంత పని చేశాడు..!

Twitter hides Donald Trump and White House tweets for glorifying violence, సోషల్ మీడియాపై ట్రంప్ అన్నంత పని చేశాడు..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి కోపమొచ్చింది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాపై విరుచుకుపడ్డ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమ సంస్థలకు ఇప్పటివరకు ఉన్న చట్టపరమైన రక్షణలను తొలగించే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. సామాజిక మాధ్యమ సంస్థలు ఆన్‌లైన్‌ కంటెంటును తనిఖీ చేస్తే చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డర్‌ ద్వారా సర్వీస్‌ ప్రొవైడర్ల నిబంధనల ప్రకారం, ఏ రకమైన కంటెంట్ నిరోధాన్ని మోసపూరితమైందిగా లేదా అస్థిరమైందిగా పరిగణిస్తారో తెలపాలని ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌(ఎఫ్‌సీసీ)ని కోరింది.
ఈ మధ్యే డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌లో చేసిన కామెంట్‌పై ట్విటర్‌ ఫ్యాక్ట్‌చెక్‌ చేపట్టడాన్ని ట్రంప్‌ తీవ్రంగా పరిగణించారు. అంతేకాకుండా, సోషల్‌ మీడియాపై చర్యలు ఉంటాయని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్ పై సంతకం చేశారు ట్రంప్. అమెరికా ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించేందుకే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ఉపయోగపడుతుందని ట్రంప్‌. వెల్లడించారు. ‘వ్యక్తుల లేదా గ్రూపుల మధ్య జరిగే చర్చలను మార్పు చేయడం, తొలగించడం, దాచి పెట్టడం, నియంత్రించడం వంటి విశేష అధికారాలు ఈ టెక్నాలజీ కంపెనీలకు ఉంటాయని.. భవిష్యత్తులో దీన్ని పునరావృతం కానివ్వమన్నారు డొనాల్డ్‌ ట్రంప్‌.


ఒకవేళ ఇది చట్టంగా మారితే మాత్రం సామాజిక మాధ్యమాలను కూడా ప్రచురణకర్తలుగానే పరిగణించే అవకాశముంది. అంతేకాకుండా సోషల్‌ మీడియా వేదికలపై యూజర్లు వెల్లడించే విషయాలకు సదరు కంపెనీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో వ్యక్తులు చేసే కామెంట్లకు సదరు వెబ్‌సైట్‌ లేదా సోషల్‌ మీడియా సంస్థలు 1996 చట్టం ప్రకారం బాధ్యత వహించవు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక సోషల్‌ మీడియా సంస్థలు ఈ స్వేచ్ఛను కోల్పోయే అవకాశం ఉంది. అయితే, ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెక్షన్‌ 230 ప్రకారం ప్రైవేటు ఇంటర్నెట్‌ ఆపరేటర్లను నియంత్రించే అధికారం ట్రంప్‌కు లేదంటున్నారు. ఇది సోషల్ మీడియా కంపెనీలపై కఠినమైన, రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ అభిప్రాయపడింది.

Related Tags