మరోసారి మొరాయించిన ట్విట్టర్

ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ మరోసారి మొరాయించింది. బుధవారం రాత్రి 8.00 గంటల సమయంలో భారత్‌, జపాన్‌ సహా పలు ప్రాంతాల్లో ట్విటర్‌ సేవలు నిలిచిపోయాయి. ట్విట్టర్ సైట్‌, యాప్‌ ఓపెన్‌ అయినప్పటికీ.. ట్వీట్‌ చేయడానికి ప్రయత్నించిన వారికి “”some thing went wrong” అంటూ ఎర్రర్ మెసెజ్ వచ్చింది. ఆ సమయంలో ఆన్‌లైన్‌లో ఉన్న ట్విటర్‌ వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. అనంతరం కాసేపటికి సేవలు ప్రారంభమయ్యాయి. అయితే ట్విట్టర్‌ గత కొద్ది రోజులుగా […]

మరోసారి మొరాయించిన ట్విట్టర్
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2019 | 7:36 AM

ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ మరోసారి మొరాయించింది. బుధవారం రాత్రి 8.00 గంటల సమయంలో భారత్‌, జపాన్‌ సహా పలు ప్రాంతాల్లో ట్విటర్‌ సేవలు నిలిచిపోయాయి. ట్విట్టర్ సైట్‌, యాప్‌ ఓపెన్‌ అయినప్పటికీ.. ట్వీట్‌ చేయడానికి ప్రయత్నించిన వారికి “”some thing went wrong” అంటూ ఎర్రర్ మెసెజ్ వచ్చింది. ఆ సమయంలో ఆన్‌లైన్‌లో ఉన్న ట్విటర్‌ వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. అనంతరం కాసేపటికి సేవలు ప్రారంభమయ్యాయి. అయితే ట్విట్టర్‌ గత కొద్ది రోజులుగా ఇలాంటి సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోంది. గత జూన్‌ నెలలో కూడా ట్విట్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. కాసేపు సేవలకు అంతరాయం కలిగింది. అయితే దీనిపై ట్విటర్‌ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.